పౌర్ణమి సంద్భంగా అమ్మణ్డీ ఆలయంలో చండీయాగం.
పౌర్ణమి సంద్భంగా అమ్మణ్డీ ఆలయంలో చండీయాగం.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
కాళ్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు, తమిళ ఆరాధ్య దైవం, భక్తుల కొంగు బంగారం, దక్షిణముఖ కాళీ, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షములో చండీయాగం నిర్వహించారు. ఈ యాగం ఆలయకార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉభయకర్తలుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి ప్రశాంతి దంపతులు వ్యవహరించినారు. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీమతి మన్నెముద్దు పద్మజ, కర్లపూడి సురేష్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.