• అఖిలపక్షం పిలుపు మేరకు ఛలో మదనపల్లి
  • ఛలో మదనపల్లి కి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను పోనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు గృహానిర్బంధం చేయడం చాలా దారుణం
  • మాజీ శాసనసభ్యులు  పాశం సునీల్ కుమార్ ధ్వజం




 తంబలపల్లి నియోజకవర్గం లోని కొత్తకోట గ్రామంలో దళిత జడ్జి రామకృష్ణ  తమ్ముడు రామచంద్రపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు  దారుణంగా దాడి  చేసి గాయపరచడం దారుణమైన ఘటన అనీ మాజీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు, శుక్రవారం  తెలుగుదేశం పార్టీ ఛలో మదనపల్లె కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, ఈ కార్యక్రమానికి గూడూరు నుండి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు గురువారం రాత్రి తరలి వెళ్లేందుకు సిద్ధం కావడంతో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు మేరకు 1వ పట్టణ ఎస్సై సైదులు, పోలీసు సిబ్బంది గూడూరు అశోక్ నగర్ లోని పాశం స్వగృహానికి చేరుకొని ఛలో మదనపల్లి కి వెళ్ళనియకుండా గృహ నిర్భధం చేశారు.
 దింతో టిడిపి నేతలు పోలీసులు మధ్య కొద్దీ చెపు వాగ్వివాదం చోటుచేసుకుంది, పోలీసులు మాత్రం పాశం ఇంటి ముందు టెంట్ వేసి కూర్చున్నారు, దింతో పాశం పోలీసులు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, ఈ  సందర్భంగా విలేకరులతో పాశం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు నాయుడు  నిజానిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి,జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రయ్య ను  పరామర్శించి అక్కడ వారిపై జరిగిన దాడిపై వివరణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు,అందులో  భాగంగ సోమవారం  కమిటీ సభ్యులమైన తాము అక్కడకి వెళ్లి చూస్తే అతనిపై వైసీపీ నాయకులు చాలా దారుణంగా దాడి చేశారు అనీ నిర్ధారణ కావడం, రామచంద్రయ్య చనిపోయే పరిస్థితి నుండి బతికి బయటపడ్డారు అనీ ఇంత దారుణంగా దాడి చేయడం వెనుక వైసీపీ ప్రభుత్వం  హస్తం ఉందని ఆయన ఆరోపణలు చేశారు.
 వైసీపీ  ప్రభుత్వం అన్ని సీట్లను గెలిచి అధికారంలో ఉంది అంటే అది కేవలం బడుగు,బలహీన వర్గాల వారు వేసిన ఓట్లతోనే  అనీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు *పెట్టుకోవాలి అనీ ఆయన సూచించారు,కానీ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి బడుగు బలహీన వర్గాలపైనే అధికంగా దాడులు చేయడం హేయమైన చర్యలు అన్నారు,అఖిలపక్షం పిలుపు మేరకు ఛలో మదనపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నామని  పోలీసులు వచ్చి  మమ్మల్ని బయటకు వెళ్లనియకుండా గృహానిర్భంధం చేయడం ఎంతవరకు సబబు అనీ ఆయన ప్రశ్నించారు, 
 గత ప్రభుత్వంలో ఇలా దళితులను గృహానిర్బంధం చేయలేదు అని నేడు అధికార పార్టీ దళిత నేతలు ఇళ్లపైకి పోలీసులను పంపి గృహ నిర్బంధన చేసి  తమ హక్కులను హరించడం బాధాకరం అన్నారు అది రాత్రి వేళల్లో ఇలా వ్యవహరించడం చాలా దారుణం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.మున్సిపల్ ఛైర్మెన్ గా, శాసనసభ్యునిగా సేవలు చేసిన  తనను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండాలని గృహా నిర్బంధం చేయడం ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలకు అద్దం పడుతుంది అన్నారు. 
 గత  తెలుగుదేశం ప్రభుత్వం లో  ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా దౌర్జన్యాలు జరిగినట్లు ఎక్కడైనా దాఖలు  ఉన్నాయా అనీ ఆయన ప్రశ్నించారు,150 మంది దళితులు పై ఈ ప్రభుత్వంలో  దాడులు జరగడం చాలా దారుణం అన్నారు, రాష్ట్ర ప్రజలపై బడుగు, బలహీన వర్గాలపై ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులను గుర్తుపెట్టుకొని రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్పాలని ఆయనపిలుపునిచ్చారు,దళిత జడ్జి రామకృష్ణ గారి  రామచంద్ర య్య  పై దాడి చేసిన హంతకులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని ఆయన హెచ్చరించారు, డిమాండ్ చేశారు,ఇకనైనా  వైసీపీ నాయకులు బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న దాడులను ఆపాలని లేకపోతే రాబోయే రోజులలో  తగిన గుణపాఠం ప్రజలు చెపుతారని ఆయన , 
 ఈ కార్యక్రమంలోగూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి. శ్రీనివాసులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, టిడిపి నాయకులు అలీబాషా ,పిల్లేల.శ్రీనివాసులు, కొనతం. సురేష్,రావుల.సురేంద్ర,చిల్లకూరు.రవికుమార్,పార్థసారథి,పర్వతాల సాయి తదితరులు పాల్గొన్నారు.