చిట్టమూరు, జనవరి 20, (రవికిరణాలు) : చిట్టమూరు మండలంలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్తగుంట బస్టాండ్ సెంటర్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా వర్కర్లుచే ఏర్పాటు చేశామని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 94.48 శాతం నమోదైనట్లు వైద్యాధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. మండలంలోని మొత్తం18 బూతులలో 1181 మంది పిల్లలకు గాను 1080 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. 20,21వ తేదీ పిల్లలందరినీ గుర్తించి పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.