జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
- జిల్లా రెవెన్యూ అధికారి జి.మల్లిఖార్జున్ సూచన
నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.మల్లిఖార్జున్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహణ గురించి డీర్యో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీన జిల్లాలో ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించాలన్నారు. జనవరి 25వ తేదీన ఉదయం 9 గం. నగరంలోని సర్వోదయా కళాశాల నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఉదయం 10 గం. కస్తూర్భా కళాక్షేత్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు.ఈ నెల 24న ఉదయం 11.00 గం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ,
పాఠశాలల్లోనూ ప్రతి ఒక్కరూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులనుడీఆర్వో ఆదేశించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం తప్పని సరిగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ఈ సమావేశంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, వెంకటాచలం మండలం జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ దీన దయాళ్, డి.కె.డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మస్తానయ్య సెట్విన్ సిఈవో యం.సుస్మిత, డి.ఎస్.డబ్ల్యూ.ఓ జీవపుత్ర కుమార్ తో పాటు.. పలువురు అధికారులు పాల్గొన్నారు