గూడూరు పట్టణ మునిసిపాలిటి కార్యాలయం వద్ద పాశిం, మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ నిరసన
December 11, 2020
but it is very sad that the state government is legislating to tax taxes on the basis of registration value
,
So far municipalities have been levying house taxes based on the value of rent
👉ఇప్పటివరకు పురపాలక సంఘాలలో అద్దె విలువ ఆధారముగా ఇంటి పన్నులు విధించేవారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పన్నులను వార్షిక అద్దె విలువతో కాకుండా, రిజిస్ట్రేషన్ విలువతో పన్నులు విదింపు విధానాన్ని చట్టం చేయడం చాలా బాధాకరం. 👉దీని వలన పేద,దిగువ మద్య తరగతి ప్రజలు పై అధిక మొత్తంలో పన్నులు భారం పడుతుందని అన్నారు.
👉కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దీనిపై పునరాలోచించి రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నులను వేయకుండా వార్షిక అద్దె విలువ ఆదారంగా ఉన్నటువంటి ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించాలని అన్నారు.
👉అధికార ప్రభుత్వం 18 నెలల పాలన కాలములో ధరలు పెంచడం ద్వారా ప్రజలపై 70 వేల కోట్ల రుపాయుల భారం మోపారని, మరో 1.30 లక్షల కోట్ల అప్పు చేసారని అన్నారు.
👉ఈ రాష్ట్ర ప్రభుత్వం పౌర సదుపాయాలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. 👉పరిశుబ్రమైన త్రాగు నీరు, గాలి , పరిశుబ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాద్యత అని అన్నారు.డ్రైనేజి లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, మంచి నీటికి , డ్రైనేజి వ్యవస్థకు లింక్ లేకుండా చూడటం, ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ లను క్లీన్ చేయించడం , క్లోరినేషన్ , బ్లీచింగ్ చేయించడం ప్రభుత్వం బాద్యత.
👉కాని ప్రభుత్వం ప్రతి స్కీం ను స్కాం గా మార్చేసిందని అన్నారు.
👉మొన్న గుంటూరు లో బ్లీచింగ్ పౌడర్ పేరుతో పనికిరాని సుద్ద, సున్నం చల్లారని, అల్లాగే ఏలూరు త్రాగు నీటి వలన ప్రజలు హాస్పిటల్ పాలయ్యరని అన్నారు.
👉గూడూరు పట్టణ మునిసిపాలిటి పరిధిలో అనేక ప్రాంతాలలో పారిశుద్యం అద్వానంగా ఉందని మురికివాడలలో, మురికి కాలువలు శుబ్రపరచక ఎక్కడి మురికి నీరు అక్కడే నిలబడి, తద్వారా దోమలు ప్రబలి ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారని, గతంలో గూడూరు పట్టణం నందు