ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే మహిళ మృతి అత్యంత హేయమైన సంఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే ఓ మహిళ ఆత్మహత్య సంఘటనపై స్పందించి ఆత్మకూరు పట్టణానికి గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు విచ్చేశారు.. ఈ సందర్భంగా వారు పట్టణంలోని జె ఆర్ పేట లో నివాసం ఉంటున్న కొండమ్మ ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించి కొండమ్మ పిల్లలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు.సాక్షాత్తు భర్త భార్యను ఆత్మహత్య కు ప్రోత్సహిస్తూ వీడియో తీయడం బాధాకరమని, మీ కుటుంబానికి మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పిల్లలకు శ్రీమతి పద్మగారు భరోసా కల్పించారు..ఇటువంటి సంఘటన నిజంగా మానవత్వం ఉన్న మనుషులకు సిగ్గుచేటైన సంఘటనని అన్నారు. తర్వాత ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కట్టుకున్న భార్య ప్రాణం తీసుకుంటూ ఉంటే ఆమె భర్త కనీసం మనిషిగా కూడా స్పందించక పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన ఒక స్త్రీ లోకానికి కాకుండా మానవ లోకానికి తీరని మచ్చ అని శ్రీమతి పద్మ గారు తెలిపారు..ఇటువంటి మృగాళ్లు కూడా మనుషుల మధ్య ఉన్నారా అనిపించే ఈ సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామని అన్నారు..ఏ చిన్న సంఘటనను కూడా రాష్ట్ర పోలీస్ స్పందించే విధంగా దిశా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రచారం చేస్తూ ఉన్న కూడా దానిని ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర సచివాలయ పోలీస్ వ్యవస్థ ద్వారా మరింతగా దిశ యాప్ గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు.. గుండమ్మ పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా సంప్రదించి తగు న్యాయం చేస్తామని కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారుడైన ఆమె భర్త ను కఠినంగా శిక్షించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని అన్నారు.అలాగే వైజాగ్ లో జరిగిన సంఘటనపై వారు మాట్లాడుతూ నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు... వీరి వెంట మహిళా కమీషన్ మెంబర్ గజ్జల లక్ష్మీ.. ఐసీడీఎస్ పీడీ రోజ్ మాండ్, ఆత్మ కూరు ఆర్డీవో చైత్రవర్షిణి, మున్సిపల్ కమీషనర్ రమేష్ బాబు, . ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు----
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు....
నియోజకవర్గ నాయకులతో మండలాల వారీగా అబ్దుల్ అజీజ్ సుదీర్ఘంగా చర్చించారు.
కార్యకర్తలకు , నేతలకు ఎప్పుడు అండగా ఉంటామని అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు..
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగిన సహించేది లేదని.. అధికార పార్టీ దౌర్జన్యాలు ,ఆగడాలను ఎంత మాత్రం సహించమన్నారు..
పత్రికా ప్రకటన
తేదీ: 01-06-2021,
ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
కోవిడ్- 19 సోకిన రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
సోను సూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఆక్సిజన్ ప్లాంట్ స్థలాన్ని పర్యవేక్షించిన మంత్రి మేకపాటి
ఆత్మకూర్ టిడ్కో కేర్ సెంటర్ లో భోజనం సహా ఇతర సదుపాయాలపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి
ఏరియా ఆసుపత్రి మొత్తం కలియతిరుగుతూ ప్రత్యక్షంగా అక్కడి సదుపాయాలను పర్యవేక్షించిన పరిశ్రమల శాఖ మంత్రి
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్న అధికారులను మాత్రమే సంప్రదించాలని తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి
అత్యవసర విభాగం సహా ఆక్సిజన్, వెంటిలేటర్ విభాగం, వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహించే ప్రాంగణాలను పరిశీలించిన మంత్రి మేకపాటి
ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారిని పలకరించిన మంత్రి మేకపాటి
ఆత్మకూరు ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
ఇటీవల విశాఖపట్నం ద్వారా ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి అందిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లని పరిశీలించి, వాటి పనితీరును పర్యవేక్షించిన మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు, వైద్యులు, ప్రజలు ఇదే పద్ధతిలో మరింత చొరవ తీసుకుని శ్రమిస్తే కరోనాని నియంత్రించగలమని వెల్లడించిన మంత్రి మేకపాటి
కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి అక్కడ నోడల్ ఆఫీసర్ లు, వైద్యులు, నర్సులు సహా ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీసిన మంత్రి మేకపాటి
కోవిడ్ కి సంబంధించి మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ ల ద్వారా తీసుకున్న మంత్రి మేకపాటి
ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ (అభివృద్ధి), ఆర్డీఓ చెైత్ర వర్షిణి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, ఆర్ఎంవో, నియోజకవర్గ, మండల స్థాయి వైసీపీ నాయకులు,తదితర అధికారులు హాజరు
సూళ్ళూరు పేట..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే కంచుకోట
కంచుకోటను...మంచి కోటగా పెంచుకుంటూ పోతాం
తిరుపతి బై ఎలక్షన్ లో వైసీపీదే బావుటా
మంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పాలన ఉన్న దొరవారిసత్రం మండలంలో టీడీపీకి డిపాజిట్లు
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి
సూళ్లూరుపేటలో వైసీపీ జెండా ఎగరాలంటే మంత్రులు రానక్కరలేదు
ఇక్కడ ప్రజలు వైసీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు
దొరవారిసత్రం మండలంలో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమే
గత ఎన్నికలలో ఈ మండలంలో 23,893 ఓట్లు పోలయ్యాయి, అందులో వైసీపీవే 15, 891 ఓట్లు పడ్డాయి. 6,290 ప్రతిపక్షాలకు వచ్చాయి.
సంక్షేమ పాలనకు నిలువుటద్దంలా ఉన్న తరుణంలో 4వేల ఓట్లు అటు ఇటు అయితే చాలు
ఇక్కడి కార్యకర్తల కృతజ్ఞతభావం వలన నాకు కూడా ఎక్కువ కష్టపడకుండానే మంచి పేరు వస్తుందని చమత్కరించిన మంత్రి మేకపాటి
ముఖ్యమంత్రి సుపరిపాలనలో, ప్రజలకు ఎమ్మెల్యే అండదండలతో ఈ సారి పోటీలో నిలబడలేరు. తట్టుకోలేరు.
ప్రజల్లో ఉంటేనే ఓట్లు..ప్రజలకి మంచి చేస్తేనే మద్దతు
----------------------------
మనసు చలించి..మానవత్వం పంచి..
రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి తక్షణ రక్షణ చర్యలు చేపట్టిన మంత్రి మేకపాటి
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారిసత్రం మండలం ప్రచారానికి వెళుతూ..రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చెన్నైకి చెందిన ద్విచక్ర వాహనదారు
గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశం
గాయపడిన వ్యక్తిని ఆర్ఎస్ఐ చంద్రమౌళి ద్వారా ఆస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
రాబోయే మూడేళ్లూ కనీ విని యెరుగనంత అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికరంగానికి సంబంధించి త్వరలో మరో శుభవార్త
ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా నివర్ పరిహారం
దేశంలోనే 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఒక్కటే
జాయింట్ కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి మేకపాటి సమీక్ష
తుపాను వల్ల కలిగిన కష్ట, నష్టాల అంచనాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి మేకపాటి
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించడమే ప్రభుత్వ పనితీరుకు ఒక ఉదాహరణ
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, ఆర్ బీకేలు, జనతా బజార్లు, బడులు, ఆస్పత్రుల నాడు-నేడు సహా అన్నింటి పూర్తికీ మార్చి నెలే డెడ్ లైన్
తుపాను వంటి విపత్తుల సమయంలో ఇంత త్వరగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదు
ఈ స్థాయి వేగంగా ఎన్నడూ అంచనాలు వేసి నివేదిక ఇవ్వలేదు
కార్పొరేట్ స్థాయికి తగ్గని విధంగా సకల సదుపాయాలతో ప్రభుత్వ బడులు, ఆస్పత్రులు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వేగంగా గ్రామాల అభివృద్ధి
కరోనా సమయంలో కష్టాలొచ్చినా అధిగమించాం, కాస్త ఆలస్యమైనా 90శాతం పనులు పూర్తి చేశాం
పేదలందరికీ పాఠశాల, ఆస్పత్రుల విషయంలో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు
మద్దతు ధర సహా రైతుల విషయంలో సీఎం ముందు చూపు వల్లే పంజాబ్ పరిస్థితి ఏపీలో లేదు
సరికొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు
ఈడీబీ నిధుల ద్వారా విశాఖ, చెన్నై కారిడార్లు కూడా త్వరగా అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక, ఎమ్ఎస్ఎమ్ఈలకు సంబంధించి మరింత అభివృద్ధి
అంగన్ వాడీ పాఠశాలలో నియామకమైన మహిళలకు ఆర్డీవో కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
ప్రజల కనీస అవసరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే మంత్రి ఆదేశాలు
అంతకు ముందు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో నియోజకవర్గంపై నివర్ తుపాన్ వల్ల పంట నష్టం సహా పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశ నిర్వహణ
నిర్మాణంలో ఉన్న ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ పనులను పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అత్యాధునిక సదుపాయాలతో మున్సిపల్ కార్యాలయం తయారయ్యేందుకు మరింత శ్రద్ధ చూపాలని మంత్రి ఆదేశం
కొత్త మున్సిపల్ ఆఫీస్ లో వెలుతురు బాగుంది, మిగతా విషయాలపై శ్రద్ధ వహించాలన్న మంత్రి
భవన నిర్మాణానికి, విద్యుత్ సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి, అయిన ఖర్చు వివరాలపై అధికారులతో ఆరా
ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నిర్మితమవుతున్న సమావేశమందిరం సహా మొత్తం మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నలుమూలలా పరిశీలన
ఆర్ అండ్ బీ భవనాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి
వచ్చే ఆరు నెలలో పూర్తికి కృషి చేస్తామని హామీ
రూ. 40 కోట్లు పైన వెచ్చించి వర్షపు నీరు నిలవని విధంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, తోటలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి
మొదటి దశలో రూ.20కోట్లతో పనులు వేగంగా పూర్తి చేస్తాం
నియోజకవర్గంలో మంత్రి రాకతో సన్మానాలతో ముంచెత్తిన ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు
మంత్రితో పాటు సమావేశాలకు హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. ప్రభాకర్, ఆర్డీవో సువర్ణమ్మ
మర్రిపాడు లో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం