వైయస్సార్ నగర్ ఇందిరమ్మ గృహాలు లో జరిగిన ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి పై చర్యలు ఏమయ్యాయి
November 19, 2020
as to why no action was being taken
,
BJP state executive members questioned Seshayya
,
Midatala Ramesh Housing Corporation
,
project director
తాజాగా లబ్ధిదారుల గృహాలను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేషయ్య ను ప్రశ్నించారు..
వై ఎస్ ఆర్ నగర్ లో నిర్మించిన 6120 గృహాలలో లో 1730 గృహాలు నివాసానికి పనికిరావని టెక్నికల్ కమిటీ నిర్ధారించింది . ఇందులో ఎనిమిది కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం కాగా ఇంతవరకు ఎవరి పై చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం తాజాగా ఇల్లులు నిరుపయోగంగా ఉండడంతో అసలైన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనందున వారి గృహాలను అన్యాక్రాంతం చేస్తు హోసింగ్ కుంభకోణం జరుపుతున్నారు..వారిపై విచారణ జరిపించాలని బిజెపినేతలు డిమాండ్ చేశారు.. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపినీలగిరి సంగం మండల అధ్యక్షుడుచిలక ప్రవీణ్. బెల్లంకొండ రామకృష్ణ.చిట్టెప రెడ్డి వెంకటరమణ .కేశవ లు పాల్గొన్నారు