నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ భవనం లో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ వి ఆర్ శేఖర్ రావు ,కార్యదర్శి యన్. ఆంజనేయవర్మ ఆధ్వర్యంలో
కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యోగ కార్మికుల వ్యతిరేక విధానాలపై  జాతీయ స్థాయి కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపు మేరకు ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ
నిరసన కార్యక్రమం ఉద్దేశించి అధ్యక్షులు శేఖర్ రావు గారు మాట్లాడుతూ క్రింది డిమాండ్లను వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు మా డిమాండ్లు

1.PFRDA బిల్లు రద్దు చేయాలని,
2.D.A ఆపుదల ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని
3.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని
4.ఔటసోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయాలని మొదలగు డిమాండ్లు వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శి ఆంజనేయ వర్మ ,అసోసియేట్ అధ్యక్షులు నాగిశెట్టి గిరిధర్, జిల్లా కోశాధికారి బి వెంకటేశ్వర్లు , ఆర్గనైజింగ్ కార్యదర్శి  యం. పెంచల్ రావు ,ఉపాధ్యక్షులు జి రమేష్ బాబు, ఎల్ పెంచలయ్య ,సంయుక్త కార్యదర్శులు కే రాజేంద్ర ప్రసాద్, యం వి సువర్ణ కుమారి, నగర అధ్యక్షులు ఎన్.వెంకటస్వామి,నగర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణారెడ్డి , నగర కోశాధికారి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు శేషయ్య, నగర సంయుక్త కార్యదర్శి యన్. రాజేంద్ర రాష్ట్ర కౌన్సిల్ మెంబర్  సురేష్ కుమార్ ,మొదలగు వారు పాల్గొన్నారు.