కావలి పట్టణ ముఖద్వారమైన ముసునూరు వద్ద మహానుభావుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ, మాజీ సీఎం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వైసీపీ ముఠా పట్టపగలు తొలగించడం దుర్మార్గం. ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్డుకు దూరంగా ఉన్న విగ్రహాన్ని తొలగించడం ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, విధ్వంసాలకు పరాకాష్ట. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవడమే కాదు..వారిపై వైసీపీ అధిష్టానమే స్పందించి కఠినచర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడము అమానుషం - చేజర్ల
నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు లో ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ నాయకులు ప్రోద్బలంతో తొలగించడము అమానుషం.స్థానిక నాయకుకు అన్న గారి అభిమానులు తమ సొంత ఖర్చులతో ట్రాపిక్కుకు ఎటువంటి అంతరాయం లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి2018, జనవరి 8 తేదీన శ్రీ నారా లోకేష్ గారి చేతులు మీదుగా అవిష్కరించడము జరిగింది.వై యెస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వాటిని తొలిగించే ప్రయత్నం చేయలేదని కానీ నేడు వైసీపీ ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుని విగ్రహాన్ని తొలగించడము దారుణం.ఇప్పటికయినా జిల్లా ఉన్నతాధికారులు అయినా జోక్యం చేసుకొని విగ్రహాన్ని తిరిగి యధాస్థానములో ఉంచాలని కోరుకుంటున్నాం
చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి