తిరుపతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రభావం బలంగా చూపించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రచారం విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్న విధానాలను అనుసరిస్తోందని చెప్పాలి. ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలను
తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి చేస్తున్నారు.ఆర్.టి.సి బస్సులో తిరగడం అంతేకాకుండా రవాణా సౌకర్యాలను సమర్ధవంతంగా వాడుకుని ప్రచారం నిర్వహించడం, బస్తీ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లి వెళ్లి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. పార్టీలో యువతకి కూడా ప్రచారంలో బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామం.