ముగ్గురు జర్నలిస్టులపై అనిల్ విమర్శల వర్షం..
July 20, 2020
anilkumaryadav
,
journalist
,
Nellore
,
YSRCP
,
zp
ముగ్గురు జర్నలిస్టులపై అనిల్ విమర్శల వర్షం.... నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముగ్గురు జర్నలిస్టులపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు... కరోనా కష్టకాలంలో సహకరించాల్సిందిగా పోయి ఆ ముగ్గురు జర్నలిస్టులు విమర్శలు చేయడమే పనిగా మారిపోయిందని ఆయన తనదైన శైలిలో విమర్శలు సంధించారు. దయచేసి జిల్లాలోని జర్నలిస్టులు అందరూ సహకరించాలని ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక పార్టీ కి పని పాటా లేదని ఆ పార్టీ జూమ్ పార్టీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.. ఈ ముగ్గురు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజల పక్షాన ఉండాల్సిన జర్నలిస్టులు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మీరు మారాలన్నారు. విధి నిర్వహణలో నెల్లూరు జిల్లాలో పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడ్డారని వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు అందజేసామన్నారు, వారికోసం మూడు, నాలుగు హోటల్స్ సిద్ధం చేయాలని అధికారులకు చెప్పామన్నారు.. సంజీవని బస్సులను తీసుకొనివచ్చి రాష్ట్రంలో కొత్త ప్రక్రియకు నాంది పలికామన్నారు. రాష్ట్రంలో ఒక్క పైసా లేకుండా కరోనా వైద్యం అందిస్తున్నామన్నారు