నవరత్నాలు భాగంగా మన్నెముత్రి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ద్వారా   పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం

నెల్లూరు జిల్లా:- సూళ్లూరుపేట మండల పరిధిలో ఉన్న మన్నెముతేరి గ్రామం నందు సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి  ఆధ్వర్యంలో  పేదలకు ఇల్లు పట్టాల కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ద్వారా పట్టాకి అర్హులైన ప్రతి పట్టాదారుకు  పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో స్థలం, ఇల్లు లేని ప్రతి పేదవాడికి  వైయస్సార్ పేద పట్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు .

➡️ మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సొంత ఊరిలో తన సొంత భూమిని ఆ గ్రామంలో పేదవారికి నా ఆధ్వర్యంలో ఇవ్వడం నాకు ఎంతో గౌరవం గా ఉంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో DCMC డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్,  డివిజన్ అధికారి, సరోజిని, స్థానిక తాసిల్దార్ రవి కుమార్, మండల డెవలప్మెంట్ అధికారి నర్మద, హౌసింగ్DEE, AE, సచివాలయం సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, కోడూరు రాశేఖర్, నెల్లూపూడి మణి తదితరులు పాల్గొన్నారు