ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు నిర్వహించిన సమావేశం ముగిసింది. అనంతరం కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని... జిల్లాతో పాటు
తేది:01-06-2021
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ పై ఆనందయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత మీడియాకు వివరాలు తెలియజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు, ఆర్డివో హుస్సేన్ సాహెబ్ గారు, రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ఆనందయ్య ఆయుర్వేద మందుకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులతో మందు తయారీ మరియు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశమయ్యాం.
👉సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారులు ఆనందయ్య అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సజావుగా, సాఫీగా మందు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
👉 మందు తయారీలో గానీ, పంపిణీలో గానీ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పంపిణీ చేయడం జరుగుతుంది.
👉 ఆనందయ్య ఆయుర్వేద మందు నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో అవసరమైన వారందరికీ, పంపిణీ చేయడంతో పాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి కూడా వివిధ పద్ధతుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించాం.
👉 ఆయుర్వేద మందు కోరుకునే వారికి ఇతర జిల్లాలోని అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కోవిడ్ నిబంధనలు పాటించి పంపిణీ చేయడానికి ఆయా ప్రాంతాల ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటే అవసరమైన మందు తయారు చేసి, అందిస్తాం.
👉 ఆయుర్వేద మందు వ్యక్తిగతంగా కోరుకునే వారికి పోస్టు ద్వారా, కొరియర్ సర్వీస్ ద్వారా, ఆన్లైన్ ఆర్డర్ ద్వారా అందించడంతో పాటు, ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వారికీ కూడా నేరుగా అందించే ఏర్పాటు చేస్తాం.
👉 కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆయుర్వేద మందు పంపిణీ చేసే అవకాశం లేనందున దయచేసి ఎవ్వరూ తరలిరావద్దని మనవి.
👉 ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, కరోనా సోకిన వారికి వెంటనే మందు అందించడంతోపాటు, కరోనా నివారణకు కూడా అవసరమైన మందు తయారు చేసి పంపిణీ చేస్తాం.
👉 కళ్లలో వేసే డ్రాప్స్ కు సంబంధించి, హైకోర్టులో రిట్ పెండింగ్ లో ఉన్నందున కోర్టు తుది ఉత్తర్వుల మేరకు, తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
👉 ప్రజలందరూ కోవిడ్ నేపథ్యంలో నియమ, నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి చెందకుండా కరోనా నివారణకు సహకరించవలసినదిగా మనవి.
👉 ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపించి అనతికాలంలోనే అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
👉 ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో పాటు, తోడ్పాటునందిస్తున్నా ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
👉 ఆయుర్వేదంలో అపారమైన అనుభవం ఉన్న ఆనందయ్య కరోనా నివారణకు, కరోనా నిర్మూలన కోసం చేస్తున్న కృషికి అభినందనలు.