మాజీ ఆర్థికశాఖామాత్యులు





,వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి కామెంట్స్ :


👉చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలతో ఏపీ లో కూడా టీడీపీ భూస్థాపితం అయిపోయింది 


👉చంద్రబాబు తీరువల్ల బయటకు రావాలంటేనే టీడీపీ నేతలు సిగ్గుపడుతున్నారు 

అధినేత అస్త్రసన్యాసంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ నేతలను చూస్తే బాధేస్తోంది 


👉తెలుగుజాతికోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే సిద్ధాంతాలను గాలికొదిలేసిన చంద్రబాబు ఒక్కరోజులో పార్టీని చంపేశాడు 


👉జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న టిడిపి అభ్యర్థులను ముహూర్తం పెట్టి బలిఇచ్చేసాడు 

రాజకీయాల్లో హత్యలుండవు ,ఆత్మహత్యలే ఉంటాయి 

ఆ మాటను ఇప్పుడు చంద్రబాబు నిజం చేసాడు 


👉ప్రపంచంలో ఏ రాజకీయపార్టీ కూడా ఇలాంటి తప్పుచేయలేదు .

చంద్రబాబు ఆత్మహత్యా సదృశ్యం తో ఆ పార్టీ ఎన్నికల్లో ఉన్నట్టా లేనట్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది 


👉అయోమయంలో ఉన్న టీడీపీ నేతలను ,కార్యకర్తలను ఓదార్చి వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా నిలవండి ..

మనపార్టీలోకి ఆహ్వానించి సంక్షేమం లో భాగస్వామ్యులను చేయండి 


👉దివాలాకోరు రాజకీయాలు చేసే టీడీపీ తన హయాంలో సోమశిల ,స్వర్ణ ముఖి లింక్ కెనాల్ కు తిలోదకాలిచ్చేసింది 


👉దివంగత వైఎస్సార్ హయాం లొ ప్రారంభమైన సోమశిల స్వర్ణముఖి కెనాల్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి 

470 కోట్లతో పనుల ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు 


👉ఆ కెనాల్ పూర్తయితే రెండుజిల్లాల్లో సాగు ,తాగునీటి సమస్య తీరుతుంది 


👉రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారు 


👉పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమం పేదలందరి చెంతకే చేరుస్తున్నారు 


👉రిజర్వేషన్ కంటే ఎక్కువస్థానాల్లో అవకాశం ఇచ్చి మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు 


👉టీడీపీ అగ్రనేతలు కనిపించని నాలుగో సింహాలుగా తమని తాము అభివర్ణించుకోవటం హాస్యాస్పదం 


👉ఉగ్రనరసింహావతారం లాంటి వైఎస్సార్సీపీ ముందు పార్టీ పరువుతీసుకొన్న టీడీపీ నేతలు గ్రామసింహాలతో సమానం 


👉జెడ్పిటిసీ ,ఎంపిటిసి బరినుంచి తప్పుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారు 


👉వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తిని దీవించి అఖండ మెజారిటీతో గెలిపించండి...డక్కిలి మండల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి