నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు క్రింద ఉన్న సొసైటీల పరిధిలోని రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి అన్నారు. శనివారం నాడు ఉదయం వెంకటగిరి లోని లాలాపేట కేంద్ర సహకార బ్యాంకు సొసైటీ కార్యాలయ ఆవరణలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి కేంద్ర సహకార సొసైటీల పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, NDCC బ్యాంకు CEO మరియు బ్యాంకు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో వెంకటగిరి నియోజకవర్గం లోని మెట్ట ప్రాంత రైతుల, కౌలు రైతుల, సొసైటీల పరిధిలోని రైతుల సమస్యలు, మరియు సొసైటీల సమస్యలు తెలుసుకోవడానికి నెల్లూరు జిల్లా అంతట తిరుగుతున్నానని, అందులో భాగంగా ఈ రోజు వెంకటగిరిలోని లాలాపేట కేంద్ర సహకార సొసైటీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించినట్లు శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే నెల్లూరు కేంద్ర  సహకార బ్యాంకు జనరల్ బాడీ మీటింగ్ లో రైతు సమస్యల విషయంలో చర్చించి రైతులకు తగిన న్యాయం చేయడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన వెంటనే వెంటనే నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు సమాచారం ఇస్తే అట్టి బ్యాంకు లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు తమ సొసైటీల, రైతుల సమస్యలను శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. వెంకటగిరి పర్యటనలో భాగంగా శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిని శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వెంకటగిరి సంస్థానాధీశులు రాజకుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ. వి. బి. సాయికృష్ణ యాచేంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని వారిని శాలువాతో సత్కరించారు. రాజా గారు కూడా శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించారు. అనంతరం రాజా గారి చాంబర్లో జాతర నిర్వహణ మరియు పలు విషయాలు చర్చకు వచ్చినట్లు వచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమాల్లో శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంట వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, గొల్లగుంట వెంకట ముని, శ్రీనివాసులు రెడ్డి, వెలికంటి రమణారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మమ్మీ డాడీ రమేష్, ఎం శ్రీధర్, ఎం.ఏ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.