నెల్లూరు జిల్లా,
సర్వేపల్లి నియోజకవర్గంలో 108, 104 అంబులెన్స్ లను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ లలోని వసతి సదుపాయాలను పరిశీలించి, ఉద్యోగస్థులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 108, 104 వాహనాలను తీసుకొని రావడం ఒక చరిత్ర.
👉 మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రథమంగా 108 వాహనాలను తీసుకొని వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు.
👉మహనీయుడు డా.బి.ఆర్. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో పేదలకు విద్య, వైద్యాన్ని కల్పించాల్సిన హక్కు ప్రభుత్వం కు ఉంది.
👉తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
👉ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని "ఆరోగ్య శ్రీ" పధకం ద్వారా అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.
👉గత తెలుగుదేశం ప్రభుత్వం 108, 104 వాహనాలను నిర్వీర్యం చేసింది.
👉 జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు 1088 వాహనాలను విడుదల చేశారు.
👉రాష్ట్ర ప్రజలకు మంచి ఆరోగ్యం కల్పించాలని డాక్టర్స్ డే రోజు వాహనాలను ప్రారంభించడం జరిగింది.
👉ప్రజల గురించి పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
👉కరోనా నేపధ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
👉ప్రతి ఒక్కరూ 108, 104 సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలి.
👉 ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 108, 104 సిబ్బంది అంకితభావంతో సేవలందించాలి.
👉 జగన్మోహన్ రెడ్డి గారు వైద్య, విద్యా రంగానికి పెద్ద పీట వేశారు.
👉గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆరోగ్య శ్రీ కార్డులను తీసుకొని వచ్చి, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు.
👉అధునాతన సౌకర్యాలతో 108, 104 వాహనాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు.
👉సమాజానికి ఆరోగ్య భద్రత కల్పించాలని ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.