.

అంబేద్కర్ వర్ధంతి ని పురస్కరించుకుని vrc సెంటర్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు....

అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం లో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు....

ఈ సందర్బంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ....

ఒక భారతదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం కీర్తింప బడుతున్న వ్యక్తి అంబేద్కర్ గారు అని అన్నారు.....

ప్రపంచం లోనే మనకున్న సుధీర్ఘమైన రాజ్యాంగం ఇంకెవరికి లేదని అన్నారు.....

బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, వెనకబడిన తరగతులకు ప్రతీ ఒక్కరికీ సమానత్వం ఉండాలని పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ గారు అని అన్నారు.....

ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని, రాజధాని లో అంబెడ్కర్ గారి భారీ  విగ్రహాన్ని పెట్టామని దాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు....

ఈ సందర్బంగా నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి  శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...

ఇంతటి మహనీయుడికి నివాళి అర్పించడం చాలా గర్వాంగా ఉందని అన్నారు...

ఇలాంటి మహనీయుడు మళ్ళీ పుట్టాలని ఆకాంక్షించారు...

దేశం లో ఎంతో మంది పుడుతుంటారు, చనిపోతుంటారు కాని ఈ మహనీయుడు ప్రపంచం మొత్తం కీర్తింప బడుతున్నారని అన్నారు...

ఈ సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ...

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగుబలహీన వర్గాల, పీడిత ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సందర్బంగా నివాళి అర్పించడం జరిగింది...

అందరికీ సమానత్వం ఉండాలని, అందరికీ ఓటు హక్కు ఉండాలని, అందరూ సమానంగా ఉండాలని పాటు పడిన వ్యక్తి డాక్టర్ br అంబేద్కర్ గారు అని అన్నారు....

70 సంవత్సరాల క్రితం భవిష్యత్తు లో బడుగు బలహీన వర్గాలకు సమానత్వం ఉండాలని, అణచివేత కు గురి కాకూడదని పాటుపడిన మహనీయులు అంబేద్కర్ గారు అని అన్నారు...

రాజ్యాంగం లో సమాన హక్కులు పొందుపరిచిన, మన దేశం లో సమాన హక్కుల కోసం పోరాడే దుస్థితి లో ఉన్నామని అన్నారు...

ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ....

ఈరోజు ఈ దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాలు, వెనక బడిన తరగతులు వారు సోకసంద్రం లో మునిగిన రోజు అని అన్నారు...


ఆయన మన ముందు లేకపోవచ్చు కాని, అయన రాసిన భారత రాజ్యాంగం లో ఆయన మనకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు అని అన్నారు...

ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీస్కుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు...

ఈ కార్యక్రమం లో పనబాక భూలక్ష్మి,చెన్నా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాతంగి కృష్ణా, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, రేవతి, ప్రశాంత్ కుమార్, శాంతి నాయుడు, పముజుల ప్రదీప్, ఉప్పు రంగా, ఆనంద్, గంగాధర్, నవీన్, షఫీ, రోజా రాణి, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు