తిరుపతి ఎంపీగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయం కోసం వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నియోజకవర్గ నాయకులు, ఇన్ చార్జిలు, కార్యకర్తలతో సమావేశం..
తిరుపతి ఎంపీగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయం కోసం వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నియోజకవర్గ నాయకులు, ఇన్ చార్జిలు, కార్యకర్తలతో సమావేశం..
పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద బాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు నిమ్మల రామా నాయుడు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామక్రిష్ణ, నెలవల సుబ్రహ్మణ్యం, పరసా రత్నం, కంభం విజయరామిరెడ్డి, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జీవీ ఆంజనేయులు, బాలస్వామి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు
సోమిరెడ్డి కామెంట్స్
కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే బీమా ప్రీమయం కట్టేందుకు వైసీపీ ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది...
ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎంని కలిసే ధైర్యం లేదు..ప్రజలకు అవసరమైన పనులు చేయించుకునే అవకాశం లేదు...
టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా వెంటనే స్పందించి ఉత్తర్వులిప్పించేవారు..
గత ఏడాది ఎడగారు సీజన్ లో నెల్లూరు జిల్లా రైతులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు..
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని పుట్టి రూ.7 వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది..అదే సమయంలో ఏట్లో ఊరికే దొరికే ఇసుకేమో ట్రక్కు రూ.7 వేలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి..
సీఎంను కలిసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయమని మేం కోరితే జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేదు..
ఇక్కడ నోర్లు పెద్దవిగా చేసుకుని మాట్లాడే నాయకులు ప్రజల అవసరాల కోసం సీఎం వద్ద నోరు విప్పలేకపోతున్నారు..
టీడీపీ ఐదేళ్ల పాలనలో తప్పుపట్టే అవకాశం లేకుండా పాలన సాగించాం..ఇప్పుడు రెండేళ్లకే ప్రజలు విసిగివేసారిపోయారు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు..ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేకుండా మనందరం ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది..
తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ పోటీ నామమాత్రమే...వైసీపీ, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం...
బీజేపీ నేతలు సోము వీర్రాజు, సునీల్ ధియోదర్, జీవీఎల్ తో సహా అందరూ వైసీపీ గురించి నోరు తెరిచి మాట్లాడరు..
రెండేళ్ల పాలనలో ప్రజాజీవితాన్ని చిన్నాభిన్నం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం బీజేపీ నేతలకు లేదు..
2018-19లో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనులకు సంబంధించి 2,450 కోట్లు కేంద్రం విడుదల చేస్తే ఆ నిధులను తొక్కిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదు...
ప్రజల అవసరాలు తీర్చేందుకు అప్పు తెచ్చి పనులు చేసిన చిన్నాచితకా కుటుంబాలు నలిగిపోతున్నా స్పందించరు..
నిత్యం చంద్రబాబును విమర్శించడం కాదు...రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పండి...
సాక్షాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుంటే మాట్లాడరు....విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగతుంటే నోరు విప్పరు...
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయి..
పనబాక లక్ష్మి అప్పుడెప్పుడో చంద్రబాబును విమర్శించారని అంటున్నారు...ఆమెకు పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసే మంచి నాయకురాలిగా పేరుంది....
ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో వాజ్ పేయి నుంచి నరేంద్ర మోదీ వరకు చంద్రబాబు నాయుడిని చాలా సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు...అలాగని ఇప్పుడు కూడా పొగుడుతారా...
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు తదితరులు నోటికొచ్చినట్టు తిట్టారు..అలాగని ఇప్పుడు కూడా తిడుతారా...
పనిచేసే లక్ష్మిగా పేరుగాంచిన పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించుకుని పార్లమెంటులో తిరుపతి గొంతు వినిపించేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి...