విద్యుత్ శాఖ ఎస్ ఈ విజయ్ కుమార్ రెడ్డి నివాసంపై ఏసీబీ దాడులు 





 నాలుగు కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు   మార్కెట్ విలువ పరిగణలోకి తీసుకుంటే మరో ఐదు రెట్లు హెచ్చింపు 

 ఏసిబి అధికారుల అదుపులో ఎస్ సి విజయ్ కుమార్ రెడ్డి  కేసు నమోదు వేగవంతం గా  సోదాలు- దర్యాప్తు  కోర్టుకు హాజరు పరిచి - రిమాండ్ కు తరలింపు యోచనలో ఏసీబీ అధికారులు  జిల్లాలో సంచలనం రేపిన ఏసీబీ అధికారులు దాడులు  నెల్లూరు, కలువాయి,కోట ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు  అక్రమ ఆస్తులు కూడా బెట్టిన ఎస్ ఈ విజయ్ కుమార్ రెడ్డి  కలువాయి ఎస్ ఈ మామా ఊరులో ఎక్కువగా బినామీ ఆస్తులు :విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  విజయ్ కుమార్ రెడ్డి నివాసం పై  ఏసీబీ అధికారులు బుధవారం దాడులు  నిర్వహించారు.నెల్లూరు లో సుదీర్ఘకాలంగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని అభియోగాలపై ఆయన పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆయన నివాసం తో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంత్రో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ దాడుల్లో మొత్తం నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.. 


 పకడ్బందీ సమాచారంతోనే దాడులు చేసాం... 

 

 విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి అక్రమాస్తుల గురించి వివిధ వర్గాలు అందించిన సమాచారం మొత్తం ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు  ఏసీబీ ఏఎస్పీ దేవానంద్  శాంత్రో పేర్కొన్నారు  మీడియాతో మాట్లాడుతూ.. తమకున్న సమాచారం తో ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని ఈ దాడుల్లో రెండు ఇళ్లు , 14 ఎకరాల వ్యవసాయ భూమి , ఐదు ఇళ్ల స్థలాలు, 50 లక్షల డిపాజిట్లుగుర్తించామన్నారు... ఐసిఐసిఐ బ్యాంకు కు సంబంధించి లాకర్ ను తెరవాల్సి ఉందని పేర్కొన్నారు... 1995 లో సాధారణ స్థాయిలో ఉద్యోగంలో చేరిన విజయ్ కుమార్ రెడ్డిఅంచెలంచెలుగా ఎదిగి 2017 లో సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికిచేరుకున్నాడన్నారు... విజయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు