మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్, అటవీ శాఖలు ఏం చేస్తున్నాయి..కేసులు పెట్టే దమ్ము లేదా..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్, అటవీ శాఖలు ఏం చేస్తున్నాయి..కేసులు పెట్టే దమ్ము లేదా..
జిల్లా కలెక్టర్, ఎస్పీలు నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంటే ఈ అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసేదెవరు..
కంటేపల్లిలోని అటవీ భూముల్లో ఒకటికి రెండు సార్లు మైనింగ్ మాఫియా అడ్డంగా దొరికితే ఫారెస్ట్ అధికారులు స్పందించరా..
పోలీసులు కేసులు నమోదు చేయరా...ఎమ్మెల్యే ఏం చెబితే దానికి తల ఊపుతూ కూర్చుంటారా..
పేదలు సొంత అవసరాలకు, సొంత పొలాల్లోని మట్టి తోలుకుంటే మాత్రం కేసులు నమోదు చేసి వారాల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతారు..మాఫియాను మాత్రం వదిలేస్తారా...
రైతులు సాగు చేసుకోవడానికి మేం అభ్యంతరం చెప్పడం లేదు...అక్రమ తవ్వకాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం..
సర్వేపల్లికి ఎమ్మెల్యేకి నిజాయతీ ఉంటే కంటేపల్లి అటవీ భూమిలో మైనింగ్ కు ఏ శాఖతో అనుమతి ఇప్పిస్తారో... ఇప్పించమనండి...
నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్ కుమార్, కురుగొండ్ల రామక్రిష్ణ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ గణేష్ ని కలిసిన సోమిరెడ్డి...
జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని కంటేపల్లి అటవీ భూముల్లో మాఫియా ఆగడాలను జేసీ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతల బృందం..
నెల్లూరు జిల్లాలో ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతూ ప్రకృతి సంపదను దోచేస్తోంది..
ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో అర్ధరాత్రుల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడటమే గాక తిరిగి బుకాయిస్తున్నారు...
జూన్ 19, 21వ తేదీల్లో సర్వేపల్లి రిజర్వాయరులో గ్రావెల్ భారీ ఎత్తున దోపిడీకి గురవుతుంటే జీపీఎస్ ఫొటోల ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం..
లక్ష క్యూబిక్ మీటర్ల దొంగతనం జరిగితే చివరకు తీవ్ర ఒత్తిళ్ల మధ్య 10 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమేనని కేసు పెట్టారు..
ఆ 10 వేల క్యూబిక్ మీటర్లకు కూడా ఢిల్లీలో ఉండే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కేసు పెట్టి ఆయనను బలిచేశారు..
అన్నీ ఎమ్మెల్యే అనుచరుల దొంగ సంతకాలు, ఒకే చేతిరాతతో దొంగ దరఖాస్తులు...వీటికి సంబంధించి అసలు దొంగలను పట్టుకోవడంపై ఈ రోజుకీ దిక్కులేదు..
దరఖాస్తులో ఎంపీ అని లేదు కాబట్టి ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాదని ఇరిగేషన్ ఈఈ చెబుతున్నారు..
తప్పులు మీద తప్పులు చేసేసి ఈ రోజు ఇంజనీర్లు బుకాయిస్తున్నారు..
జూన్ 22న కంటేపల్లిలోని అటవీ భూముల్లో భారీగా గ్రావెల్ కొల్లగొడుతుంటే విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి దాడులు నిర్వహించి 15 టిప్పర్లు, మూడు ప్రొక్లెయిన్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు..
అక్రమ మైనింగ్ చేసిన కంపెనీలకు ఐదు రెట్లు జరిమానా, ఇతర ఫెనాల్టీలు విధించాల్సివుండగా ఎమ్మెల్యే ఒత్తిడితో రూ.1.60 లక్షలు మాత్రమే వేసి వదిలేశారు..
అటవీ భూముల్లో గ్రావెల్ కొల్లగొడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా పోలీసు కేసు నమోదు చేయకుండా వదిలేశారు..
కంటేపల్లి అటవీ భూముల్లో అటవీయేతర కార్యక్రమాలు చేయడం నేరమని అటవీ శాఖ అధికారులు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో స్పష్టం చేశారు.
ఆగస్టు 7న మళ్లీ అదే కంటేపల్లిలో, అదే అటవీ భూమిలో, అవే కంపెనీలు భారీ ఎత్తున గ్రావెల్ దోపిడీకి తెరలేపాయి..
ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగించిన గ్రావెల్ టిప్పర్లలోని ఒక టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీగలు దళితుల నివాసంపై పడ్డాయి..
అదృష్టవశాత్తు లైన్ ట్రిప్ అయిపోవడంతో 9 మంది దళితులు ప్రాణాలతో బయటపడ్డారు..
పొలాల్లో మెరకను తొలగించడానికి రైతులే అప్రూవల్ ఇచ్చారని తహసీల్దార్ సమక్షంలో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు..
అటవీ భూమిలో, అందులోనూ పీఓబీలో ఉన్న భూమిలో రైతులు అప్రూవల్ ఇవ్వడమేంటో, తహసీల్దార్ తల ఊపడం ఏంటో అర్థం కావడం లేదు...
రైతులు సాగు చేసుకోవడానికి మేం అభ్యంతరం చెప్పడం లేదు...అక్రమ తవ్వకాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం..
తహసీల్దార్, మైనింగ్, అటవీశాఖ ఇతర ఏ అధికారులైనా సరే 287 సర్వే నంబరులో ఒక్క క్యూబిక్ మీటరుకైనా గ్రావెల్ తవ్వుకునేందుకు అనుమతి ఇప్పించగలరా..
అదే వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లిలో ఉల్లిపాయల బుజ్జమ్మ అనే మహిళా రైతు తన పొలంలోని మట్టిని తన ఇంటి వద్దకు తోలుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
జూలై 19న ఆమె పొలంలో నుంచి మట్టి తోలుతున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేస్తే 15 రోజుల తర్వాత కోర్టు ద్వారా విడిపించుకున్నారు..
ఇక్కడ మాత్రం అటవీ భూముల్లో రేయింబవళ్లు రైల్వే పనుల కోసం గ్రావెల్ కొల్లగొడితే మాత్రం ఎలాంటి కేసులు లేవు..
కంటేపల్లికి సంబంధించి ఎలాంటి కేసులూ పెట్టలేదని పోలీసులు ఆర్టీఐ ద్వారా సమాధానం ఇచ్చారు..ఇది బరితెగింపు కాదా..
రైతులు ఒప్పుకుంటే ప్రభుత్వ, అటవీ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా ఇష్టానుసారంగా మట్టి తోలుకోవచ్చని చట్టం తీసుకురండి..
టీడీపీ హయాంలో చెరువుల్లో పూడిక తీసే ఉద్దేశంతో రైతులు ఎవరైనా తోలుకుంటామంటే ఉచితంగానే మట్టి ఇచ్చాం...ఇసుకను ఉచితంగానే అందుబాటులో ఉంచాం.. మీ మాదిరిగా ఇసుక, గ్రావెల్, మట్టి అడ్డంగా దోచుకోలేదు..
అప్పట్లో లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారని అంటున్నారు..అవి అనుమతులతో తవ్వారో, అనుమతి లేకుండా తవ్వారో..అనేది కూడా ఎమ్మెల్యేనే బయటపెట్టు...
పేదలు సొంత ఇంటికి మట్టి తోలుకుంటే కేసులు నమోదుచేసి వారాలు తరబడి వాహనాలు సీజ్ చేస్తున్నారు..మాఫియా పబ్లిక్ గా దోచేస్తుంటే చర్యలు తీసుకునే దమ్ము మాత్రం లేదు..
జిల్లా వ్యాప్తంగా మైనింగ్ మాఫియాను అడ్డుకోకపోతే అంతిమంగా అధికారులే బాధ్యులు కాబోతున్నారు..దోపిడీకి గురైన ప్రతి రూపాయిని కక్కించే వరకూ విశ్రమించబోము..
మేం చేయబోతున్న న్యాయపోరాటంలో దోషులుగా నిలబడబోయేది అధికారులే..ఎమ్మెల్యేలు నోటిమాటలతో తప్పించుకుంటారని గుర్తుంచుకోండి..
ఈ రోజు నుంచైనా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి చట్టపరంగా, న్యాయంగా నడుచుకోండి...
కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు బొమ్మి సురేంద్ర, జెన్ని రమణయ్య, ఒట్టూరు సంపత్ యాదవ్, గుమ్మడి రాజాయాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఏలూరి రంగారావు, కాకార్ల తిరుమల నాయుడు, పనబాక భూలక్ష్మి, శ్రీపతి బాబు, ఊరందూరు సురేంద్ర, జలదంకి సుధాకర్, నన్నేసాహెబ్, ఈపూరు మునిరెడ్డి, చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆకుల హనుమంతరావు, జాకీర్ షరీఫ్, కనపర్తి గంగాధర్ తదితరులు..