శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,
SPS నెల్లూరు జిల్లా
శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
మానవతావాదం, ఆదర్శవాదం వంటి పలు సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు – యస్.పి. గారు మొదట వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి, తదుపరి జిల్లా పోలీసు కార్యాలయం నందు భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు. అంటరానితనం పై ఉక్కుపాదం మోపి, దేశ ప్రజలను సంఘటితం చేసిన గొప్ప దార్శనికులు. ఎంతో మందికి మార్గదర్శకుడైన అజాతశత్రువు. మొదటి మహిళా లోక్ సభ స్పీకర్ శ్రీమతి మీరా కుమార్ గారి తండ్రే ప్రజానాయకుడు అయిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రజలకు ఆశాజ్యోతి. రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు. ప్రజలు ఆప్యాయంగా "బాబూజీ" అని పిలిచేవారు. నేడు వారి "జయంతి" సందర్భంగా ఆ మహావీరుడికి నమస్సుమాంజలు అర్పించుకుందాం- యస్.పి. గారు శ్రీ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర్య సమరయోధుదిగా, సంఘసంస్కర్తగా, పట్టుదల, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా పోలీస్ స్టేషన్ ల యందు స్మరించుకున్న జిల్లా పోలీసు అధికారులు.