కొండమీద కొండూరులో సిపిడబ్ల్యుస్ స్కీమ్ తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ విధ్యారమ






అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  ఏఎస్ పేట మండలంలోని  కొండమీద కొండూరు గ్రామంలో ఉన్న సిపిడబ్ల్యూఎస్  స్కీమ్ ను   జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి విధ్యారమ బుధవారం తనిఖీ చేశారు ఈ స్కీం పరిశీలనలో ఎంపీడీవో ప్రసన్నకుమారి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఏఎస్ పేట మండలంలో 13 నివాసిత ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం అందజేస్తుందని,  సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ యెుక్క పనితీరును ముఖ్య కార్యనిర్వహణ అధికారికి  గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు వివరించారు అలాగే ఈ స్కీమ్ పనితీరును స్థానిక ప్రజలతో మరియు ప్రజా ప్రతినిధులతో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి  విద్యారమ చర్చించారు అనంతరం జడ్పీ సీఈవో విద్యారమ  మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ఉన్న అన్నీ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ తనిఖీ చేసి వాటి పని తీరును నివేదిక కోరినందున అందులో భాగంగా బుధవారం కొండమీద కొండూరు లోని స్కీమ్ ను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ స్కీమ్ పరిధిలో గల 13 నివాసిత ప్రాంతాల్లో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్డెయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ రావు, ఎంపీడీవో ప్రసన్నకుమారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవితేజ, విస్తరణ అధికారి రమేష్,  సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు