కారోనా దృష్ట్యా ఏటి పండుగను నిషేధించాలి-కౌన్సిలర్ జె.మౌనిక(బిజెపి)
కారోనా దృష్ట్యా ఏటి పండుగను నిషేధించాలి-కౌన్సిలర్ జె.మౌనిక(బిజెపి)
నాయుడుపేట సంక్రాంతి పండుగ సందర్భంగా నాయుడుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే స్వర్ణముఖి ఏటీ పండుగను కారోనా దృష్ట్యా ఈ సంవత్సరం నిషేధించాలని మున్సిపల్(బిజె పి)కౌన్సిలర్ జంబుగోళం.మౌనిక అన్నారు.మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కమీషనర్ లింగారెడ్డి.చంద్రశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.కారోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశం లోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు.నాయుడుపేట మున్సిపాలిటీ లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కన పెట్టి రూ 14 లక్షల రూపాయలు(జనరల్ ఫండ్) ఏటీ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించడానికి మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమోదించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఏటీ పండుగను కరోన దృష్ట్యా నిషేధించాలని ఆమె కోరారు.