ఎనిమిదో వార్డుకు చెందిన వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక. 




నెల్లూరు [కావలి], రవికిరణాలు ఏప్రిల్ 16 : 

కావలి పట్టణంలో ఎం డి ఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఇంటిటికి ప్రచార గ్రామంలో సమస్య ఏది పరిష్కారం నాది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా బుధవారం 8వ వార్డులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 8వ వార్డుకు చెందిన వైసిపి నాయకులు మొగల్ రహీమ్బేగ్ మైనారిటీ పట్టడం మాజీ వైసిపి అధ్యక్షులు మొగల్ షమ్మరహీం (మాజీ కో ఆప్షన్ నెంబర్) షేక్ పీర్ మహమ్మద్ మైనార్టీ రూరల్ మాజీ అధ్యక్షులు మరియు షేక్ పర్వీజాని (మాజీ జిల్లా మహిళా కమిటీ నాయకులు) తెలుగుదేశం పార్టీలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, 9 నెలల లోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ, సుపరిపాలన అందిస్తున్నారని వారి నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదవ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.