మంత్రి కాకాణి కి జేజేలు పలికిన చిన్న చెరుకూరు గ్రామ ప్రజలు"
"మంత్రి కాకాణి చేతుల మీదగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు"
"సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, చిన్న చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ పశు వైద్యశాలను మరియు సి.సి రోడ్ లను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు శాశ్వత ప్రాతిపదికన అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి కాకాణి"
"సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న, తాము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ భూములకు అసైన్మెంట్ పట్టాలు ఇట్చిన మంత్రి కాకాణి ని పూలమాలలతో ముంచెత్తిన మహిళలు"
"గ్రామంలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరగడం విశేషం"
"పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ మంత్రి కాకాణి ని ఘనంగా సత్కరించి, ఆశీస్సులు అందించి, భావోద్వేగానికి గురైన మహిళలు, రైతులు"
"ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు రకరకాల నాటకాలు ఆడుతున్నాడు - మంత్రి కాకాణి"
"చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన అంకె మూడు అని.. నమ్మిన వాళ్లకి మూడు నామాలు పెట్టాలన్నది ఆయన లక్ష్యమని ఎద్దేవా చేసిన మంత్రి కాకాణి"
"2019 ఎన్నికల వరకు అందరికీ మూడు నామాలు పెట్టిన చంద్రబాబును ప్రజలు గమనించి, 2019 ఎన్నికలలో పంగనామాలు పెట్టి సరైన బుద్ధి చెప్పారన్న మంత్రి కాకాణి"
"2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో చంద్రబాబు నాయుడు మరోసారి అనేక కల్లబొల్లి హామీలతో వస్తున్నాడన్న మంత్రి కాకాణి"
"ఇలాంటి హామీలను నమ్మవద్దని.... 2014 ఎన్నికల మేనిఫెస్టోను కూడా చంద్రబాబు నాయుడు మాయం చేసిన సంగతిని గుర్తు చేసిన మంత్రి కాకాణి"
"ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే ఓట్లు దండుకునే దానికి చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు - మంత్రి కాకాణి"
"ఆరోజు చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా.. అది ఇప్పించిన ఘనత నేటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది - మంత్రి కాకాణి"
"చంద్రబాబు నాయుడు మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు - మంత్రి కాకాణి"
"జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన చేయడం చేతకాదు... బటన్ నొక్కడమే పరిపాలనా అని మాట్లాడిన చంద్రబాబు, ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఒక బటన్ నొక్కాడు నేను ఒక్కొక్కరికి 4, 5 బట్టలు నొక్కుతాను అనడం హాస్యాస్పదం - మంత్రి కాకాణి"
"ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే నారలోకేష్ సమావేశాలకు వచ్చినప్పుడు మైక్ పట్టుకొని ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి నెలకు 15 వేల రూపాయల చొప్పున 90 వేలు ఇస్తానంటే ఎవడో ఒక అమాయకుడు నమ్మక పోతాడా నాకు ఓటు వేయకపోతాడా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎక్కడైనా ఉందా అని ప్రజలు ఆలోచించాలి - మంత్రి కాకాణి"
"ఇలాంటి దొంగ హామీలు ఇచ్చే వారిని అసలు నమ్మొద్దు అన్న మంత్రి కాకాణి"
"ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు - మంత్రి కాకాణి"
"గత ఎన్నికలకు ముందు 3 వేల పెన్షన్ లను అందిస్తామని హామీ ఇచ్చామని, ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి 3 వేల పింఛన్ ను అందిస్తున్నామన్న మంత్రి కాకాణి"
"కరోనా సమయంలో అమ్మవడి పై కూడా విమర్శలు చేసిన చంద్రబాబు, నేడు తన రాజకీయ ఉనికి కోసం రకరకాల డ్రామాలు వేస్తూ... ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మవడి కూడా ఇస్తానని మాయమాటలు చెబుతున్నాడన్నాడు - మంత్రి కాకాణి"
"సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కరించామని పేర్కొన్న మంత్రి కాకాణి"
"చుక్కల భూములకు సంబంధించి రైతులకు పూర్తి హక్కులు కల్పించామన్న మంత్రి కాకాణి"
"గత ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాము కాబట్టే ప్రజల నేడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వెనుక నడుస్తున్నారు - మంత్రి కాకాణి"
"మీ కుటుంబానికి మేలు చేకూరితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగేన ముఖ్యమంత్రి ఒక్క శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్న మంత్రి కాకాణి"
"ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతోంది - మంత్రి కాకాణి"
"పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు జనరంజక పాలన అందించారని తెలిపిన మంత్రి కాకాణి"
"సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో 26 లక్షల 50 వేల రూపాయల ఆర్.ఐ.డి.ఎఫ్ విధులతో నిర్మించిన గ్రామీణ పశు వైద్యశాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి గారు"
"చిన్న చెరుకూరు గ్రామంలో సిమెంట్ రోడ్ లను 1 కోటి 3 లక్షల రూపాయలతో నిర్మించామన్న మంత్రి కాకాణి"
"చిన్న చెరుకూరు గ్రామానికి సంబంధించి బ్రహ్మంగారి మఠం వరకు లింక్ రోడ్డు కోరారని దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి కాకాణి"
"అనంతరం చిన్న చెరుకూరు గ్రామ పంచాయతీ పరిధి లోని 97 కుటుంబాల వారికి 118 ఎకరాల భూమిని శాశ్వత ప్రాతిపదికన అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి కాకాణి"
👉 ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ... దేశంలోనే పెద్ద ఎత్తున పెన్షన్ లను మన రాష్ట్రంలో 59 లక్షల మందికి 3 వేల రూపాయలు వంతున అందిస్తున్నామన్నారు
👉 గ్రామ వాలంటీర్ లు ప్రతి నెల 1వ తారీఖున ప్రొద్దున్నే తలుపు తట్టి పెన్షన్ లను అందించే విధంగా ఏర్పాట్లు చేసిన ఘనత శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కిందన్న మంత్రి కాకాణి
👉 వైయస్సార్ ఆసరా పథకం ద్వారా సంఘ బంధాలకు చెల్లిస్తామని మాట ఇచ్చిన ప్రకారం 4 విడతలలో వారి ఖాతాలలో నేరుగా జమ చేశామన్న మంత్రి కాకాణి
👉 వైయస్సార్ చేయూత పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాలలో 18,750 రూపాయల వంతున 3 విడతలు చెల్లించామని, మరో విడత ఈ నెలలోనే జమ చేస్తామని తెలిపిన మంత్రి కాకాణి
👉 నేతన్న నేస్తం , కాపు నేస్తం, ఈ బీసీ నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఓడి పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు పరచామన్న మంత్రి కాకాణి
👉 మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు అండగా నిలవమని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని కొనియాదిన మంత్రి కాకాణి
👉 రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, వర్షం వెలిసిన వెంటనే రైతులకు నారుమళ్లు అందించడంలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టిందని తెలిపిన మంత్రి కాకాణి
👉 ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను సకాలంలో సమకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, తనకు ఆశీస్సులు అందించాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి గారు
కొత్త జిల్లాల తో సంపూర్ణ అభివృద్ధి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం, సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతాయని సులూరుపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. పట్టణంలోని శనివారం ఆర్. అండ్. బి. అతిథి గృహం నుండి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలు ఆధ్వర్యంలో ర్యాలీగా పుర వీధుల్లో తిరిగి ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల రెట్టింపు కావడంతో ఆయా జిల్లాల్లో విస్తీర్ణం తగ్గడంతోపాటు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటై అధికారుల నియామకం జరిగి అన్నీ జిల్లాలు మంచి అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేస్తాయని, అంతేకాకుండా ప్రజలకు అనువుగా జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో ప్రజలు తమ పనులను సులభంగా చేసుకోగలరని, శ్రీ బాలాజీ జిల్లా రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి పథకంలో బాలాజీ జిల్లా ముందుంటుందని కొనియాడారు .ఈ ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండడం సంతోషదాయక మన్నారు. అలాగే పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం, భీముల వారి పాలెం ఓడరేవు, అంతర్జాతీయ విమానాశ్రయం,శ్రీసిటీ సేజ్, మాంబట్టు సెజ్,మేనకూరు సెజ్ లు ఉన్నాయని వీటితోపాటు దుగ్గరాజపట్నం పోర్టు కూడా ఏర్పాటు కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి,సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, తడ మండల అధ్యక్షుడు కొలివి రఘు, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు,నాటక మండలి చైర్మన్ కళాత్తూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ ,చిన్న సత్యనారాయణ మరియు సర్పంచ్ లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ .
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన OTS (ఒన్ టైం సెటిల్మెంట్) జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో భాగంగా కోటపోలూరు 1&2 సచివాలయంలో, ఆబాక సచివాలయంలో, KCN గుంట సచివాలయంలో,మంగళంపాడు సచివాలయంలో, మంగానెల్లూరు సచివాలయంలో మరియు దామానెల్లూరు సచివాలయం పరిధిలోని లబ్ధిదారులకు వన్ టైమ్ సెటిల్మెంట్ పట్టాలను లబ్దిదారులకు నేడు