బ్రహ్మదేవంలో వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం. 




ఘన నివాళులు అర్పించిన వైకాపా నాయకులు. 


ముత్తుకూరు, సెప్టెంబర్ 2( మేజర్ న్యూస్) బ్రహ్మ దేవం గ్రామపంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిపారు. జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ (అగ్ని) , మాజీ సర్పంచి కే సుబ్రహ్మణ్యం, మైనార్టీ నాయకులు బషీర్ సాహెబ్, ఎంపిటిసి సభ్యురాలు హైమావతి, వాటి కార్యకర్తలు గ్రామస్తులు హాజరు కావడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి ఆయన పరిపాలన గురించి గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడారు. డాక్టర్ వైయస్సార్ పరిపాలన ఒక చరిత్ర లాంటిది అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంస్కరణలు, బడుగు బలహీన వర్గాలకు చేయూత అందివ్వడం లాంటి పరిపాలన అందించారని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఆయన మరణం చాలా బాధాకరమని ఒక మంచి మహా నాయకుడును రాష్ట్రం కోల్పోయింది అన్నారు. డాక్టర్ వైయస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కార్య