కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైయస్ జగన్ వెంటే నడుస్తాం
కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైయస్ జగన్ వెంటే నడుస్తాం.
మండల వైకాపా శ్రేణులు స్పష్ఠీకరణ.
ముత్తుకూరు ,డిసెంబర్ 21 (మేజర్ న్యూస్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్పష్టం చేశారు. శనివారం మాజీ సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సారధ్యంలో కార్యక్రమం జరిగింది. తొలుత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల ఎంపీపీ గండవరం సుగుణ అధ్యక్షతన జన్మదిన వేడుకలు జరిపి కేక్ కట్ చేశారు. సర్పంచులు ,ఎంపిటిసి సభ్యులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలుఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈదురు రాంప్రసాద్ రెడ్డి, బషీర్, చిన్నపరెడ్డి, గండవరం సూరి, సాయి, దేవ రెడ్డి నాగార్జున రెడ్డి, రాజా, షేక్ మౌలాలి, మహిళ విభాగం నాయకురాలు లతారెడ్డి , కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.