డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే నైతిక విజయం..

విప్  ఉల్లంఘించిన వారందరిపై వేటు ఖాయం

స్వతంత్ర అభ్యర్థి అంటూ వైసిపి కార్పొరేటర్ల చేత ఓటు వేయించుకున్నారు

విప్  భయంతోనే టీడీపీ డ్రామాలు

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.




 నెల్లూరు నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర, రూరల్  కార్పొరేటర్ల తో కలిసి.. డిప్యూటీ మేయర్ ఎన్నికలో .. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్న... అనంతరం మీడియాతో మాట్లాడారు.

డిప్యూటీ మేయర్ ఎన్నికలో టిడిపి గెలిచినప్పటికీ నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ గా కార్పొరేటర్ కరిముల్లా గారిని నిలిపి వైసిపి బీఫామ్ ఇస్తే..  టిడిపి కనీసం బీఫామ్ కూడా..ఇవ్వలేని దుస్థితిలో.. అభ్యర్థిని పోటీకి నిలిపిందని ఎద్దేవా చేశారు. 

ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ ను పెట్టుకొని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్ల చేత.. తెలుగుదేశం పార్టీ  ఓట్లు వేయించుకోవడం దుర్మార్గమన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందన్న భయంతోనే.. తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ గా పోటీకి దిగిందన్నారు. 

అయినప్పటికీ..వైసిపి బీఫామ్ తో పోటీ చేసిన అభ్యర్థికి.. ఓట్లు వేయని .. వారందరూ విప్ ఉల్లంఘించినట్లేనని ..వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో.. గెలవలేక.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన... కార్పొరేటర్లను ప్రతి సారి కొనుగోలు చేసి.. కార్పొరేషన్ తమదే అన్నట్టుగా.. బిల్డప్  ఇచ్చుకుంటుందన్నారు 

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. ఈరోజు ఓటమి రేపటి గెలుపుకు నాంది పలుకుతుందన్నారు. 

వాస్తవంగా.. తాము ఓడిపోయినప్పటికీ.. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు . 

విప్ ఉల్లంఘించిన కార్పొరేటర్ల పై .. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబోతుందని తెలిపారు. 

రాబోయే రోజుల్లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు.. అమలు దిశగా ప్రజలతో కలిసి పోరాటాలు సాగిస్తుందన్నారు.