శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలో శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకరోత్సవంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.




ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యస్.సి.,యస్.టి., బి.సి.లకు 50 శాతం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా మహిళలు కనీసం 50 శాతం ఉండేవిధంగా ఉత్తర్వులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, భగవంతుని సేవలో అవకాశం కల్పించడం రాష్ట్ర చరిత్రలో ప్రధమం. భగవంతుని సేవకు ఎంపికాబడిన ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయాలను పాటిస్తూ, స్థానిక ప్రజల, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో దేవుని భూములను తమ గుప్పెట్లో పెట్టుకొని, కౌలు డబ్బులు కట్టకుండా, దేవుని సొమ్ము స్వాహా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ శాసన సభ్యునిగా బడాబాబుల కబంధహస్తాలలోని భూములను బయటకు తీసి, వేలం పాటలు సక్రమంగా నిర్వహించి, దేవుని సేవకు వినియోగిస్తున్నాం.  సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వరదరాజస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, నూతన ధర్మకర్తల మండలి సభ్యులకు, చైర్మన్ కు నా హృదయపూర్వక అభినందనలు.