వైయస్సార్ అడుగుజాడల్లోనే వైయస్ జగన్ 




వరికుంటపాడు మేజర్ న్యూస్ 


వైయస్సార్ మరణించి పదిహేను సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని మండల కన్వీనర్ మండలపు తిరుపతి నాయుడు,  జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాగంటి శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన  వరికుంటపాడు వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్  మందలపు తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో మండల వైఎస్సార్ సీపీ నాయకులు   ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాగంటి శ్రీనివాసులు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రకారుడు, రైతు పక్షపాతి,వ్యవసాయం దండుగ కారాదు,పండుగ కావాలని ఆశించి రైతులకు ఉచిత విద్యుత్,వ్యవసాయ రుణాల మాఫీ,విద్యుత్ బకాయిల మాఫీ,పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీ తదితర సంక్షేమ పథకాలు కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హాయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అన్నారు వైయస్సార్ మరణించి 15 సంవత్సరాలు అయినా జ్ఞాపకాలు ప్రజల్లో తిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు  ఆయన ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకొని  వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా మేము నేర్చుకున్నామని తెలిపారు చరిత్రలోనే ఎన్నడలేని విధంగా  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారా  అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘన చరిత్ర వైఎస్సార్సీపి పార్టీ ఇదేనని అన్నారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను  కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించాయని గుర్తు చేశారు ఈకార్యక్రమంలో  చెన్నంపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, తిమ్మారెడ్డిపల్లి ఉప సర్పంచ్ రసూల్,నాయకులు, రాయవరపు మధుసూదన్ రావు, చెన్నా రాయుడు, చెన్నకేశవులు, దాసరి ఓబయ్య, నేలటూరి నాగరాజు, వెంగళరావు,  ఐజాక్, ప్రసాద్, రామయ్య, మాలకొండ దాస్,బంగారు బాబు, నవీన్, భాస్కర్, జయపాల్, తాతపూడి మోహన్ రావు, నాగయ్య ఆవుల రమణయ్య, మాలకొండయ్య కార్యకర్తలు పాల్గొన్నారు