వైసిపి ప్రభుత్వం.. బీసీల పక్షపాతి

.. రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడం హర్షణీయం

బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు పద్మజా యాదవ్

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను బీసీలకు  కేటాయించి బీసీల పక్షపాతి ప్రభుత్వంగా మరోసారి నిరూపించుకుందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెరుమాళ్ళ పద్మజా యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు

 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీసీ నేత పారిశ్రామిక వేత్త బీద మస్తాన్ రావు కు కేటాయించడం ఎంతో హర్షదాయకమని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో బీసీలకు ఎన్నో సార్లు వెన్నుదన్నుగా బీఎంఆర్ నిలిచారని ఆమె గుర్తు చేశారు. బీసీలకు ఎప్పుడు లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెద్దపీట వేశారని కొనియాడారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ ధన్యవాదాలు తెలియజేశారు.