నేడే ప్రపంచ మ్యాజిక్ దినోత్సవo

మాయా లేదు మర్మం లేదు అంతా ఇంద్రజాలమే

మూఢనమ్మకాలు నుండి మ్యాజిక్ ద్వారా ప్రజల్ని చైతన్య పరుస్తున్న ఎమ్మెస్ రెడ్డి

 రవి కిరణాలు తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట:-

ఫిబ్రవరి 23 పిసి సర్కార్ సీనియర్ జన్మదిన సందర్భంగా ఆరోజును మెజీషియన్లు అందరూ కలిసి ప్రపంచ మ్యాజిక్ దినోత్సవం గా ప్రకటించుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముసురుకున్న మూఢనమ్మకాలను భరతం పట్టే విధంగా మారుమూల గ్రామాల్లో సైతం మెజీషియన్స్ ప్రదర్శనలివ్వడం ఆధునిక విజ్ఞాన ప్రపంచ ప్రారంభానికి శుభసూచకమని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం పట్టణాలకు మహానగరాలకు పరిమితమైన ఇంద్రజాల ప్రదర్శనలు ప్రస్తుతం గ్రామాల్లో సైతం ప్రదర్శనలివ్వడంతో సత్ఫలితాలను ఇస్తుంది.. ఏవో నాలుగు మాటలు ఉచ్చరించి చేతిలో విబూధిని తెప్పించి దైవసంభూతులుగా తమకు తామే ప్రకటించుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్న దొంగస్వాములను ఇంద్రజాలికుల ప్రదర్శనలు విరుగుడు మంత్రాలువుతున్నాయి. దొంగస్వాములు ప్రదర్శించే మంత్రాలన్నీ కేవలం జిమ్మక్కులు, ట్రిక్కులు మాత్రమేనని విప్పి చెప్పే వీరి మాటలను -తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మెజీషియన్ ఎంఎస్. రెడ్డి తమ మ్యాజిక్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేటట్లు చేస్తున్నారు. మాయలు మంత్రాలు లేవని కేవలం ట్రిక్కులు మాత్రమేనని ఆయన చెబుతున్నారు. అరచేతిలో అద్భుతాలు చూపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మూఢనమ్మకాలను పారద్రోలి ఉత్తమ మెజీషియన్గా పేరు సంపాదించుకున్నారు ఇంద్రజాల మాయలోడని పిలువబడే సూళ్లూరుపేటకు చెందిన మండెం సుబ్రమణ్యంరెడ్డి ఇంద్రజాల తపనతోనే జీవిస్తున్నాడు. గాలినుంచి విబూధి సృష్టించడం,
కొబ్బరికాయ నుంచి నీరుకు బదులు నెయ్యి తెప్పించడం, మూడు అడుగుల బారు కత్తిని కడుపులో గుచ్చుకోవడం, కాళీ చేతి గుడ్డల నుండి  పావురాని సృష్టించడం , తల మీద మంట పెట్టి టీ కాయడం ,ఖాళీ పేపర్నుంచి కూల్డ్రింగ్ బాటిల్ 'బయటకు తీయడం చిత్రవిచిత్రాలతోపాటు ప్రజల్లో నెలకొని ఉన్న ఇటువంటి మూఢ నమ్మకాలను తన మ్యాజిక్ ద్వారా చైతన్యవంతులు చేస్తున్నావు. సూళ్లూరుపేటలోనే కాకుండా రాష్ట్రంలో 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య , నారాచంద్రబాబు నాయుడు, ప్రముఖులు డాక్టర్ సి. నారాయణరెడ్డి, డాక్టర్ సమరం, వడ్డే. శోభనాదీశ్వరరావు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు , రాజేంద్రప్రసాద్, ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళం పల్లి బాలమురళీకృష్ణలతోపాటు పలు ఇతర దేశస్తుల ప్రశంసలు అందుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే  ఉగాది పురస్కారమును రెండుసార్లు అందుకున్న ఏకైక మెజీషియన్ ఎమ్మెస్ రెడ్డి, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా అటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సన్మాన సత్కారాలు పొంది ఉన్నారు.. తిరుపతి జిల్లాలోని  శ్రీకాళహస్తిలో జన్మించి, 20 సంవత్సరాలుగా సూళ్లూరుపేట లో నివాసం ఉంటున్నాడు. ఎం.ఎస్. రెడ్డి .15 సంవత్సరాలుగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తున్నాడు. బి.వి. పట్టాభిరామన్ ఏకలవ్య శిష్యుడిగా మ్యాజిక్ ట్రిక్కులు నేర్చుకున్నప్పటికీ ఇందులో మరింత పరిణితి చెందడానికి ఇక్కడ షార్ కాలనీలో నివాసముంటున్న మరో మెజీషియన్ సిఎం వేలు, రమణయ్య, వద్ద కొంతకాలం శిష్యరికం చేసి ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు. తిరుపతి ఫైన్ ఆర్ట్స్ అకాడమికి చెందిన  విజయకుమార్ వద్ద ఇంద్రజాలానికి మరింత అర్థం
 తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా అనేక రాష్ట్రాలలో తన ప్రదర్శన ప్రదర్శించి అందరి దగ్గర ప్రశంసలు అందుకున్నారు . తెలంగాణ మెజీషియన్లు సివి రమణ, ప్రదీప్ రంగరాజ్, ఆలీ, రఘుబాబు, క్రాంతి కర్, మరి రమేష్, తనకు మ్యాజిక్ లో మెలకువలు నేర్పించే వారన్నారు. ప్రముఖ ఇంద్రజాలకులు డాక్టర్ బి వి పట్టాభి రామ్ పిసిసర్కార్ జూనియర్, జాదూగర్ ఆనంద్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, సినీ నటులు భానుచందర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి ,తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు రమణాచారి చేతుల మీదుగా అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు పొంది ఉన్నాడు. ఢిల్లీ తెలుగు అకాడమీ చే నేషనల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఉగాది పురస్కారం, మద్రాస్ తెలుగు అకాడమీ చే సమైక్య భారతి గౌరవ సత్కార్ ఉగాది పురస్కారం, హైదరాబాద్ వారుచే వెన్నెల పురస్కారం, రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వారిచే క్రియేటివ్ మెజీషియన్ అవార్డు, మ్యాజిక్ తో పాటు రోటరీ క్లబ్బు సభ్యునిగా ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించిన ఘనత మన ఎమ్మెస్ రెడ్డి ది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పక్షుల పండుగ లో అక్కడికి విచ్చేసి సినీ తారలు, సాంస్కృతిక కార్యక్రమాలను ముందుండి నడిపించే విషయంలో ప్రముఖ పాత్ర వహించేవాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రక్తదాన అవగాహన పుస్తకాన్ని ప్రారంభించారు, రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని తన మ్యాజిక్ ద్వారా ప్రదర్శించే వారన్నారు.