కోట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా పని చేయండి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
కోట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా పని చేయండి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
కమిటీ ఆదేశాల మేరకే అభివృద్ధి పనులు
మా నల్లపురెడ్డి కుటుంబం కంటే నాకు వైయస్సార్ కుటుంబమే ముఖ్యం అని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కోటలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలవల్ల నల్లపురెడ్డి కుటుంబీకులు కొంతమంది ని దూరం చేసుకోవడం జరిగిందని మరల అటువంటి పునరావతం కాకుండా చూసుకుంటానని ఆయన అన్నారు కోట అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిటీ ఆదేశాల మేరకే అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు
కోటలో ప్రక్షాళన చేస్తున్నాం కోటలో వైసిపి బలోపేతానికి చర్యలు కోటలో అభివృద్ధి కమిటీని ప్రకటించిన ప్రసన్న నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రాజేంద్ర కుమార్ రెడ్డి, వినోద్ రెడ్డి, గాది భాస్కర్,షేక్ మొబిన్ 5 మంది కమిటీతో కోటలో అభివృద్ధి పనులు జరుగుతాయి బిల్డింగ్,లే ఔట్ అప్రూవల్ కు 2 రోజుల్లో అనుమతులు పంచాయతీలో అప్రూవల్ కు ఒక్క రూపాయి తీసుకున్న తాట తీస్తా: ప్రసన్న కోట పంట కాలువ పనులు త్వరలోనే దాదారాయి గుంట ఆక్రమణ స్థలాలు స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు కోటలో ఎంపీటీసీ లు కోల్పోవడం బాధాకరం- దానికి నన్ను భాద్యుని చేయడం దుర్మార్గం:ప్రసన్న కోటలో శానిటేషన్ కు 30 లక్షలు డ్రా- విచారణ కు ప్రసన్న ఆదేశం పేర్నాటి,కొడవలూరు ధనుంజయ్య రెడ్డిలను కలుపుకుని పోతా బలమైన నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు దూరం అయ్యారు టీడీపీలో ఉన్న నల్లపరెడ్డి అభిమానులను వైసీపీలోకి తీసుకోని వస్తాం వైసీపీలో వర్గాలకు తావులేదు కోటలో పైసలు కోసం చిల్లర రాజకీయాలు చేస్తే తాట తీస్తా కోటలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట కోటలో నల్లపరెడ్డి కుటుంబం కు పూర్వపు వైభవం తీసుకొని వస్తాం పార్టీకి చెడ్డపేరు తెస్తే కుటుంబ సభ్యులను సైతం పక్కన పెడతాం నేటి నుండి కోటలో సమూల మార్పులు పంచాయతీ నిధుల పై సమీక్ష- ఎన్ సి ఆర్ కళ్యాణ మండపం కు 5 లక్షలు కేటాయింపు సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలు పూర్తి చేయాలి ఐక్యత చాటిన నల్లపరెడ్డి కుటుంబం
ఆంధ్రప్రభ✍️ మీజూరు మల్లి✍️: కోటలో ఆనాడు దివంగత మహానేతలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సుబ్బా రెడ్డి,హారనాధ్ రెడ్డి లు కోట గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకొని వచ్చారు అని,74 ఏళ్లలో కోటను కంచుకోట మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు అనీ, అలాంటి కోటలో రెండు ఎంపిటిసి సెగ్మెంట్లు కొల్పవడం చాలా బాధాకరంగా ఉంది అని మాజీమంత్రి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోమవారం కోటలోని ప్రసన్న కుమార్ రెడ్డి స్వగృహంలో కోట రాజకీయ ప్రక్షాళన,కోట అభివృద్ధి, వైసీపీ బలోపేతం పై విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 14,15 వ ఫైనాన్స్ నిధులు, డ్రీంకింగ్ పైప్ లైన్లు ఏర్పాటు, జనరల్ ఫండ్ నిధులు, పూడిక తీత పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.
మా కుటుంబ పెద్దల హయాంలో ముగ్గురు సర్పంచ్ లు పనిచేస్తే మంచి పేరు తీసుకొని వచ్చారు అనీ, అలాంటిది ఇప్పుడు కోట గ్రామ పంచాయతీకి కొంతమంది చెడ్డ పేరు తీసుకొని 74 ఏళ్ల చరిత్రకు కళంకం తెస్తున్నారు అనీ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు, కోటలో వైసీపీకి బలం లేకుండా చేయడం చాలా బాధాకరంగా ఉంది అన్నారు,తనకు వైసీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యం అనీ, ఇటీవల ముఖ్యమంత్రి కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో 22 ఓట్లు టిడిపికి మెజార్టీ రావడం,రెండు ఎంపిటిసి లు కొల్పవడం పై తనను ప్రశ్నించారు అనీ చెప్పారు.
అందువలన నేను కోట పై దృష్టి పెట్టి 74 ఏళ్ల చరిత్రను కాపాడుకొనే దిశలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అని ఆయన చెప్పారు, అందులో భాగంగానే కోటలో సర్పంచ్,8 మంది వార్డు సభ్యులతో పాటు కోటలో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశాము అని అందులో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి,నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, గాది భాస్కర్, షేక్ మొబిన్ బాషా లను నియమించి కోటలో ఏ పని చేయాలన్న కమిటీలోని 5 మంది సంతకాలు ఉంటేనే అధికారులు పనూలు చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇకనుండి కోటలో అవినీతి అక్రమాలకు చోటు ఉండదు అని,కోటలో బిల్డింగ్ అప్రూవల్, లే ఔట్ అప్రూవల్, ఇటువంటి ఇళ్ల నిర్మాణాలు, దుకాణాల నిర్మాణానికి అనుమతులకు ఎటువంటి రుసుం లేకుండా రెండు రోజుల్లో పని పూర్తి చేసిపంపాలిఅనీ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేశారు,అధికారులు ,రాజకీయ నాయకులు ఎక్కడైనా పైసలు అడిగినా,పనులు ఆలస్యం చేసిన వెంటనే తన సెల్ నెంబర్9989649999 కు కాల్ చేయాలి అని ఆయన సూచించారు, కోటలో ఎవరైనా చిల్లర రాజకీయాలు, చిల్లర కోసం చిల్లర పనులు చేస్తే కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా పార్టీ నుండి దూరం పెడతాం అని హెచ్చరించారు.
కోటలో ఉన్న దాదా రాయి గుంట స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అనీ, ఎన్ సి ఆర్ కళ్యాణ మండపం అభివృద్ధి కి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి వృద్ధిలోకి తీసుకొని రావాలి ఇంచార్జ్ సెక్రటరీ స్వరూప రాణి కిఅదేశాలు ఇచ్చారు, కోటలో సచివాలయం బిల్డింగ్, రైతు భరోసా కేంద్ర భవనాలు నట్టనడకగా నడుస్తున్నాయి అని, వాటి నిర్మాణాలకు కాంట్రాక్ట్ రులు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వదు అనీ ఎవరైనా భవనాలు కట్టేందుకు ముందుకు వస్తే వారికి ఉచితంగా భవన నిర్మాణ పనులు అప్పగిస్తామని ఆయన వెల్లడించారు,కోట గ్రామ పంచాయితీ లో శానిటేషన్ పనులు కొరకు 30 లక్షల రూపాయాల నిధులు డ్రా చేశారు అనీ, ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చూపాలి అని ఉన్నత అధికారులను విచారణకు ఆదేశించారు.
గతంలో నల్లపరెడ్డి కుటుంబానికి బలమైన అభిమానులు ఉండే వారు అనీ, వాళ్ళ అందరూ దూరం అయ్యి తెలుగుదేశం పార్టీలో, ఇతర పార్టీలో ఉన్నారు అనీ, వారందరినీ నెలాఖరులోగా ఇంటి ఇంటికి వెళ్లి వైసీపీలోకి ఆహ్వానిస్తాను అనీ, మరలా వారిని మా కుటుంబ సభ్యులు గా చేర్చుకొని పూర్వపు వైభవాన్ని తీసుకొని వస్తాను అని వెల్లడించారు, ఇంకా నుండి కోటలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ్య రెడ్డి లను కూడా కలుపుకొని పోతాం అనీ, తనకు పార్టీ ,సియం జగన్ ముఖ్యం అన్నారు, తనకు వర్గాలు అవసరం లేదు అన్నారు, గతంగతహా నేటి నుండి కోటలో సరి కొత్త పాలన తీసుకొని వస్తాం, ఇంకా నుండి చిల్లర రాజకీయాలు చేస్తున్న వారికి చెక్ పెడుతున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఎర్రటపల్లి మధు సుధన్ రెడ్డి, గాది భాస్కర్, సర్పంచ్ వెంకట రమణమ్మ, షేక్ మొబిన్ బాషా, యజద్దాని,సుబ్రహ్మణ్యం, రాయపు పొలయ్య మరియు ఎస్సై పుల్లారావు, కోట ఇంచార్జ్ కార్యదర్శి స్వరూప్ రాణి, వైసీపీ నేతలు, కార్యకర్తలు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.