సీమాంద్ర బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడూరు టౌన్‌ 2వ పట్టణ పరిధిలోని బిసి బాలికల వసతి గృహం నందు గల 10వ తరగతి విద్యార్దునులకు పరీక్ష ఫ్యాడ్స్‌,పెన్నులు ఇవ్వడం జరిగింది. తదనంతరం హాస్టల్‌ వార్డన్‌ ఎస్‌.అన్నపూర్ణమ్మని సంఘం నాయకులు మహిళా దినోత్సవం సందర్బంగా శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. హాస్టల్‌ నందు విద్యార్దునులకు బ్లాక్‌బోర్డ్స్‌ లేనందున బిసి విద్యార్ది సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లీలాకృష్ణయాదవ్‌ బ్లాక్‌ బోర్డ్స్‌ వేయించారు. వార్డన్‌ అన్నపూర్ణ మాట్లాడుతూ సీమాంద్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ప్రతి సంవత్సరం విద్యార్దునులకు 
అవసరమైన ప్యాడ్స్‌,పెన్నులు తదితర వస్తువులు అందిస్తారని అనేక కార్యక్రమాలు వసతి గృహంలో చేస్తూ విద్యార్దునులకు అవగాహన కల్పిస్తున్నారని వారికి మా యెుక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.శ్రీనివాసులు, ఎల్‌.క్రిష్ణమాచార్యులు, కె.ముత్తు, ఎస్‌.ధనశేఖర్‌, ఎన్‌.శాఖరాచారి, ఏ.రాము, జి.బోయన్న యాదవ్‌, కె.దొరస్వామి, ఎస్‌.భానుశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.