నెల్లూరు, జనవరి 28, (రవికిరణాలు) : దేవ్ గోజుర్యు కరాటే డో ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రెన్షి ఎన్.వెంకటరమణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదిన నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో 7వ స్థాయి స్టేట్ లెవల్ కరాటే టోర్నమెంట్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్‌కి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కరాటే విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొని ఈ టోర్నమెంట్‌ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ టోర్నమెంట్ యెుక్క వివరాల కొరకు 9989847911 నెంబర్‌కు సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవ్ గోజుర్యు టీమ్, తదితరులు పాల్గొన్నారు.