ఫోర్జరీ కుంభకోణంపై విచారణలో జాప్యం ఎందుకు? మంత్రి గారు, ఎమ్.ఎల్.ఏ.గారు అధికారులను ఆదేశించండి. విచారణ వేగవంతం చేసి, ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచండి. 




నెల్లూరు 


-సామాజిక కార్యకర్త న్యాయవాది కాని మురళి రెడ్డి


ఫిర్యాదు చేసి ఒకటిన్నర నెల గడిచినా ఫోర్జరీ కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకపోవడం దురదృష్టకరమని న్యాయవాది కాకు మురళి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక నెల్లూరు ప్రెన్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య పౌరులు ఫిర్యాదుచేస్తేనే ఎఫ్.ఐ.ఆర్.ను నమోదుచేసే ఈ రోజుల్లో, సాక్షాత్తు ఒక న్యాయవాది ఫిర్యాదుపై నెల్లూరు నగర కమీషనర్ ప్రాధమిక విచారణ జరిపి, చర్యలు తీసుకోమని జిల్లా యన్.పి.కి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినా ఈ రోజుకి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకపోవడం దేనికి సంకేతమని అయన ప్రశ్నించారు. 164 సీట్ల అఖండ విజయంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలపైన అలసత్వం వహించడం సరికాదని, ఈ అవినీతి ఆరోపణలతో ససైండ్ అయిన అధికారులను విచారించి, ఈ కుంభకోణంలో భాగస్వామ్యులైన ఆనాటి అధికార పార్టీ నాయకులు మరియు కొందరు కార్పోరేటర్ల పాత్రఏమిటో నిగ్గుతేల్చాస్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ఆయన అన్నారు. మునిసిపల్ శాఖా మంత్రిగా ఉన్న నారాయణ మరియు నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టిలో ఈ సమస్య ఉందని భావిస్తున్నానని, ఒకవేళ ఇప్పటివరకు ఈ సమస్య మీ దృష్టిలో లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని, ఇకనైనా సరే విచారణ వేగవంతం చేసి, చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు పెద్దల అండదండలు ఉన్నాయనే భావన ప్రజలలో కలిగే అవకాశం ఉందని, అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదుచేసేలా పోలీన్ వారిని ఆదేశించాలని ఆయన కోరారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారద్యంలో ముందుకు సాగుతున్న ప్రజాప్రభుత్వంపై సంపూర్ణ విస్వాసం ఉందని కాబట్టే వారి దృష్టికి ఈ విషయం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని ఆయన తెలియజేశారు.