చెరువుకు గండి పూడ్చేది ఎవరండీ ...
చెరువుకు గండి పూడ్చేది ఎవరండీ ...
దొరవారి సత్రం రవికిరణాలు టీవీ న్యూస్ :- చెరువులకు వర్షపు నీరు చేరాలి, కరకట్టలు పటిష్టంగా ఉండాలి, నీటి సామర్థ్యం నిల్వలకు దోహదపడాలి, రైతులు వేసిన పంటలకు సాలీనా నీరు అందించే దిశలో చెరువులు ఉండాలి. కానీ దొరవారిసత్రం మండలంలోని పాలింపాడు గ్రామానికి ఎగువన ఉన్న అన్నా రెడ్డి గుంట చెరువుకు గండి పడి రెండేళ్లు కావస్తున్న పూడ్చేది ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిన్నపాటి చెరువు క్యాచ్ మెంట్ ప్రాంతంగా ఉపయోగపడుతూ అక్కడనుండి ఏ కోళ్ళు పెద్ద చెరువుకు వర్షపు నీరు చేరేలా దోహదపడుతుంది. అయితే కట్టకు గండిపడి రెండేళ్లు కావస్తున్న దాని మరమ్మత్తులు గాలికి వదిలి వేయడంతో అందులోకి చేరే వర్షపు నీరు నిల్వ ఉండక బీడు భూములు, కాలువల్లోకి వెళుతుంది. గతంలో కూడా రెండు పర్యాయాలు ఈ గండికి మరమ్మతులు చేసిన అదే ప్రాంతంలోమళ్లీ గండి పడింది.గతంలో దీనికి మరమ్మతులు చేసిన గుత్తేదారునికి పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదని తెలిసింది. నేడు కురుస్తున్న వర్షాలకు పైనుండి ఈ చెరువుకు చేరే నీరంతా వృధాగా కిందికి వెళ్లాల్సిందే. దీని మరమ్మతులకు సంబంధిత శాఖ అధికారులు ఇరిగేషన్, పంచాయితీ రాజ్ ఎవరికి ఫిర్యాదు చేయాలనేది రైతులు సందిగ్ధంలో ఉన్నారు. పూర్వీకులు నిర్మించిన చెరువులు నేడు ఆక్రమణకు గురి కావడం, విస్తీర్ణం తగ్గిపోవడం, నీటి సామర్థ్య నిల్వలు అనుకున్న స్థాయిలో ఉండకపోవడంతో రైతులు వేసే పంటలకు సాలీనా మీరు సరఫరా కాలేక పోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి, చెరువుకు పడిన గండిని తక్షణమే శాశ్వత మరమ్మతులు చేయాలని ఆ చెరువు నీటి సామర్థ్యం నిల్వలకు దోహదపడాలని రైతాంగం కోరుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టగలరని అభిప్రాయపడుతున్నారు.