ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ చట్టాలకు వ్యతిరేకంగా కేబినెట్లో, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీతో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో కలసి దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాలాభిషేకం పుష్పాభిషేకం చేసారు. ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ వాటిపై ప్రేరణ ఇచ్చిన గాంధీనగర్ ముస్లిం మైనారిటీ మహిళలకు ఎప్పుడు రుణపడి ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముస్లిం మైనార్టీల మనోభావాలను, భయాలను తొలగించేందుకు రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిగా ఈ పోరాటంలో అందరికంటే ముందుగా ఒక అడుగు ముందుకు చేశానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి జగనన్న అండదండతో, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ పోరాటం ఫలించిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ ఉద్యమంలో నన్ను నమ్మి, నా వెంట నడిచిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్బంగా తెలియజేశారు.