సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కంటి వెలుగుకు శ్రీకారం
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఎమ్మెల్యే కాకాణి పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ"సర్వేంద్రియానం నయనం ప్రధానం" అంటారు.మానవ శరీరంలోని అన్ని అవయవాలలో అతి ప్రాధాన్యత కలిగిన అవయవాలు కళ్లు అని కంటికి సంబంధించి వ్యాధులను గుర్తించి వైద్యం అందించేందుకు జగన్మోహన్ రెడ్డి వై.యస్.ఆర్.కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారన్నారు.ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.ఈ నియోజకవర్గం లో అతి పెద్దదైన, వెనుకబడిన పొదలకూరు ప్రాంతంలోని ప్రజలకు కంటి వైద్యం అందించేందుకు మొట్టమొదట వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం లోని వైద్యశాలల అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని వైద్యులు, అధికారులు విజయవంతం చేయాలి.గత జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకొని, తీర్చేందుకు కృషి చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.కొందరు అర్హులకు పెన్షన్లు తొలగించారని అనవసరపు విమర్శలు చేస్తున్నారు.గత సర్వేల తప్పిదాల వల్ల తాత్కాలికంగా ఆగిన పెన్షన్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గం లోని మండల అధికారులతో పెన్షన్లపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నాం.చనిపోయిన వారికి, ధనవంతులకు తప్ప అర్హులందరికీ పెన్షన్ అందుతుంది.
గతంలో పొదలకూరు మండలాన్ని డెల్టా గా మార్చామని చెప్పుకున్నారే తప్ప, చేసిన పరిస్థితులు లేవు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటు పొలం ఎండిపోకుండా, రాజకీయాలకతీతంగా సాగునీరు అందించి, నిజమైన డెల్టాగా మార్చామని చెప్పేందుకు గర్వపడుతున్నా. గ్రామాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము.
మీ ఇంటి బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.