మాస్కులు ధరిస్తాం - కరోనా ని కట్టడి చేస్తాం - ఎస్ *ఐ . పి . రవి బాబు
మాస్కులు ధరిస్తాం - కరోనా ని కట్టడి చేస్తాం - ఎస్ *ఐ . పి . రవి బాబు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో మంగళవారం ఎస్ ఐ. పి రవి బాబు కరోనా కట్టడి పై అవగాహన సదస్సు కల్పిస్తూ మాస్కులు లేనివారికి మాస్క్లు అందజేశారు. నేర పరిశోధన, చట్టపరమైన చర్యలకే పరిమితి కాకుండా ప్రజా ఆరోగ్య భద్రత పట్ల కూడా సూళ్లూరుపేట పోలీస్ వారు చేపట్టిన అవగాహన సదస్సు లకు విశేషమైన స్పందన రావడంతోపాటు పట్టణ వాసులు ప్రశంసిస్తున్నారు. రద్దీ ప్రదేశాలలో కరోనా కట్టడి పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ అవగాహన సదస్సు కల్పిస్తూ మాస్కులు లేనివారికి మాస్క్లను అందజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలుగజేశారు.