హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు..
హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు..
పొదలకూరు సీఐ శివరామ కృష్ణారెడ్డి, ఎస్ఐ ఎండి హనీఫ్ విజ్ఞప్తి
పొదలకూరు మేజర్ న్యూస్
హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు అని సీఐ శివరామకృష్ణారెడ్డి,ఎస్ఐ హనీఫ్ లు కోరారు.జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులకు, పలువురికి హెల్మెట్ లను పంపిణి చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నుండి రామ్ నగర్ గేట్ సెంటర్, సంగంరోడ్డు కూడలి వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాల సమయంలో ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రమాదాల సమయంలో ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. జనవరి 10 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు హెల్మెట్ లను పంపిణి చేశామని తెలిపారు.యువకులు ముఖ్యంగా అతివేగంగా మోటార్ బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆ సమయంలో హెల్మెట్ ధరిస్తే గాయలతో బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు.