ఎమ్మెల్యేగా గెలిపిస్తాం........

 అవ్వ, తాతల దీవెనలు....

 కావలి రవి కిరణాలు ::::

 ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి మాకు తోడుండయ్య అంటూ గ్రామంలోని అవ్వ, తాతలు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆశీర్వదించారు. మంగళవారం గౌరవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమంలో పల్లె ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డిని డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.గ్రామంలోని హరిజనవాడ, గిరిజన కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు హారతులు పట్టార.జగనన్న ప్రవేశపెడుతున్న పథకాలు అందుతున్నాయా లేవా అని ప్రజలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి పథకాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం  చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గడపగడప తిరుగుతూ ఉంటే  మహిళలు మా ఇంటికి రండి అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నాడంతో ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సమృద్ధిగా అందుతున్నాయి కాబట్టే ప్రజలలో ఆనందం వెళ్ళు  విరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు రాఘవులు, సర్పంచ్ దేవరపల్లి రాధిక, దేవరపల్లి మహేంద్ర, చింతం బాబుల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి కుమార్, వాలంటీర్లు నాయకులు పాల్గొన్నారు