కాకుపల్లిలో స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం

 ఎంపీ ఆదాల హామీ

 కాకుపల్లిలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాకుపల్లిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బుధవారం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సత్యం.జి లేఅవుట్లో పార్కుకు నిధులు కేటాయించాలని, మరోచోట భూమి ఎత్తు పెంచి, పట్టాలివ్వాలని  అడిగారు. వెంటనే స్పందించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. నెల రోజుల కిందటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. ఆయా ప్రాంతాలను పర్యటించి  అక్కడ నేతలను, కార్యకర్తలను కలుస్తున్నానని చెప్పారు. కాకుపల్లి గతంలోలా లేదని, నెల్లూరు నగరాన్ని తలపిస్తోందన్నారు. నిజమైన అభివృద్ధి అంటే ఇదేనని ప్రశంసించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు చంద్రశేఖర్ రెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి కేశవులు గౌడ్,ఎంపీపీ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, పెనుబర్తి సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాదరాజు గూడూరు సర్పంచ్ వెంకటేశ్వర్లు,  ఉమామహేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య కూడా హాజరయ్యారు.