జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌ను స్వాగతిస్తున్నాం   రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్

 





గూడూరు బాలాజీ జిల్లాలోనే చరవేగంగా అభివృద్ధి

జిల్లాల పునర్విభజన మద్దతుగా కనుమూరి ఆధ్వర్యంలో వైసీపీ బైక్ ర్యాలీ

 గూడూరు నెల్లూరు కి దగ్గర మాత్రమే- దానితో ప్రయోజనం లేదు

 గూడూరు ను బాలాజీ జిల్లాలో కలపడం శ్రేష్టం-అమోఘం

 బాలాజీ జిల్లా పారిశ్రామికంగాఎంతో అభివృద్ధి చెందుతుంది

 వైద్య, విద్యా రంగంలో బాలాజీ జిల్లా అగ్రగామి

 బాలాజీ జిల్లాలో అద్భుతమైన పరిశ్రమలు

బాలాజీ జిల్లాలో గూడూరు ను కలపడం వలన సానుకూల అంశాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

 బాలాజీ జిల్లాలో అద్భుతమైన నీటి వనరులు

  పర్యటకంగా ఎంతో అభివృద్ధి

బాలాజీ జిల్లాలో షార్ కేంద్రం

 అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రం

 కృష్ణపట్నం పోర్టుకు గూడూరు కనెక్టివిటీ

 ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి తిరుమల బాలాజీ జిల్లాలోనే

 ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి

  గూడూరులో పుట్టి పెరిగిన వాడిగా మీ వాడిగా చెబుతున్న

 గూడూరు బాలాజీ జిల్లాలో కొనసాగాలి

 రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి మీడియా ద్వారా వెల్లడి

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు తెలుగు సంవత్సరాదికి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం బాలాజీ జిల్లాలో కలపడంతో వామపక్షాలు, ప్రతీ పక్ష పార్టీలు నెల్లూరు జిల్లాలో గూడూరు నుకోనసాగించాలి పోరాటాలు చేయడం తగదు అనీ ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదు అనీ, జిల్లాలపునర్విభజన మరియు గూడూరు ను బాలాజీజిల్లాలోకొనసాగించడంస్వాగతిస్తున్నాం అనీ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు.బుధవారం గూడూరు పట్టణంలోనీ తూర్పు వీధిలోని కనుమూరి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన తన మనోభావాలువెల్లడించారు.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేసింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా విభజించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. మరోవైపు జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్ని ఉగాది నాటికి అంటే కొత్త తెలుగు సంవత్సరాదికి సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగనన్న ఇప్పటికే ఆదేశించారు. అందువలన ఉగాది పండుగ వాతావరణం లో గూడూరు నియోజకవర్గ ప్రజలు బాలాజీ జిల్లాలో కొనసాగడం చాలా గొప్ప శుభపరిణామం అన్నారు.

 గూడూరు అభివృద్ధికి మహనీయులు కృషి ఎనలేనిది..

 గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి దివంగత మహా నేతలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ,  మాజీమంత్రినల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లు ఎనలేని కృషి చేశారు అనీ తెలిపారు. ఆ తరువాత  ఆ స్థాయిలో నెల్లూరు జిల్లా వాసి కానీ దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  గూడూరు అభివృద్ధికి ఎంతగానో సహకరించి కండలేరు డ్యామ్ నుండి 60 కోట్ల రూపాయల నిధులతో గూడూరు పట్టణానికి త్రాగునీరు అందించారు అని గుర్తు చేశారు.

    విద్యా,వైద్యరంగంలో అభివృద్ధి

  బాలాజీ జిల్లాలో ఇప్పటికే విద్యా, వైద్య రంగాలు ఎంతగానో అభివృద్ధి జరిగిందని హరిశ్చంద్ర రెడ్డి చెప్పారు,ఏర్పేడులో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, వెంకటగిరిలోఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లుమ్ టెక్నాలజీ మరియు తిరుపతి లో ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వేటర్ని యూనివర్సిటీలో 85 శాతం కోటా లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది అని తెలిపారు. అదేవిధంగా ఎస్వీ మెడికల్ కళాశాల, ఎస్వీ ఆయుర్వేద మెడికల్ కళాశాల,ఎస్వీ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ కళాశాలలు,పద్మావతి ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ విద్యా నికేతన్, డిమ్డ్ యూనివర్సిటీ వంటి కళాశాల ఉన్నాయి అని వెల్లడించారు.

 వైద్య రంగంలో ఎస్వీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎస్వీ రామ్ నారాయణ్ రావ్ హాస్పిటల్, బాలాజీఇన్ స్టిట్యూట్  ఆఫ్ సర్జరీ రిసెర్స్ రిహాబీలిటేషన్ వేఇ డిసేబుల్డ్( బర్ద్),ఆయుష్ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్, 600 కోట్ల రూపాయలతో టిటిడి- టాటా సంయుక్తంగా నిర్మిస్తున్న ఆతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి,వస్తున్నాయి అన్నారు.

 కొకల్లుగా పరిశ్రమలు ఏర్పాటు..

 బాలాజీ జిల్లాలో కొకల్లు గా పరిశ్రమలు ఉన్నాయి,నూతన పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నట్లు హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.శ్రీసిటీ సెజ్,చింత వరం సెజ్,రేణిగుంట లిమిటెడ్, మేనకూరు ఏపీఐఐ సి లిమిటెడ్ హిందూస్థాన్ గ్లాస్,ఆరబిందో ఫార్మా, మన్నవ రంలో ఇప్పటికే బెల్,సోమానిసిరామిక్స్ లతో పాటు 6 వేల కోట్ల రూపాయల తోసేమి కండక్టర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ తయారీ పరిశ్రమ, ఏపీ ఐ ఐ సి కాళహస్తి అన్నో పరిశ్రమ లు ఉన్నాయి అని తెలిపారు.

 నీటి వనరులకు కొదవలేదు..

 బాలాజీ జిల్లాలో తెలుగుగంగ, కండలేరు రీజర్వేయర్ ఇక్కడి నుండే గూడూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందుతుంది, వెంకటగిరి దగ్గర 5 వ బ్రాంచి కెనాల్ నుండి డిస్ట్రిబ్యూటరీస్ 4 ఎల్,13 ఎల్ ద్వారా గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందుతుంది. కళ్యాణి డ్యామ్, స్వర్ణ ముఖి బ్యారేజ్ లు అన్ని కూడా  ఉన్నాయి అని తెలిపారు.


 పర్యటక ప్రాంతంగా బాలాజీ జిల్లా ప్రసిద్ధి- అగ్రగామి

 బాలాజీ జిల్లా ఇప్పటికే పారిశ్రామికం ఎంతో అభివృద్ధి చెందింది, విద్యా, వైద్య రంగాల్లో అగ్రగామిగా ఉన్న ప్రపంచ స్థాయిలో తిరుపతి, తీరుముల దేవస్థానం పర్యటన రంగంలో అగ్రగామిగా నిలిచి  ఆధ్యాత్మికంగా చరిత్రలో గుర్తింపు పొందినవిషయం అందరికి తెలిసిందే అని హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు. ఒక్క రోజుకి సుమారు 1 లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు అని తెలిపారు. టిడిపి నిధులతో గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు.

 అదేవిధంగా తిరుపతి గోవిందయ్య,పెరుమాళ్ స్వామి తిరుచానూరు, శ్రీనివాసా మంగాపురం,శ్రీ కాళహస్తి, సూళ్లూరుపేట చెంగలమ్మ,కను పూరుముత్యాలమ్మ,వెంకటగిరి పోలేరమ్మ,గూడూరు తాళ్ళ మ్మ, పెంచలకోన పెనుశీల నరసింహ స్వామి,మల్లమ్ సుబ్రమనేశ్వర స్వామి, గూడలి సంగమేశ్వర స్వామి, ఇలా జిల్లా నలుమూలల ఆధ్యాత్మికంగా పర్యటకం ఇప్పటికే అభివృద్ధి చెందింది అని చెప్పారు.

 నెలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం,భీముల పాళెం,పులికా ట్ సరస్సు,పులికాట్ దీవులు,గుమ్మళ్ల దిబ్బలోని మాన్ గ్రోత్ ఫారెస్ట్,తూపిలి పాళెం బీచ్,శ్రీనివాస పురం బీచ్,చంద్రగిరి పోర్ట్ లను అభివృద్ధి చేసుకుంటే మరింత పర్యటన కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.


 అంతర్జాతీయ షార్ కేంద్రం బాలాజీ జిల్లాలోనే...

 ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ శ్రీహరి కోట సతీష్ ధావన్ స్వేష్ సెంటర్ (షార్ )కేంద్రం  బాలాజీ జిల్లాలో ఉంటుంది కనుక  ఇప్పుడు గూడూరు బాలాజీ జిల్లాలో కొనసాగడంతో మన జిల్లా కు గర్వకారణం తలమానికంగా ఉంటుంది అని ఆయన తెలిపారు.

 అంతర్జాతీయ విమానాశ్రయం

 బాలాజీ జిల్లాలోఅంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రం అందుబాటులో ఉండటం వలన పోర్టు కనెక్టివిటీ పరిశ్రమలు,పర్యాటకం,విద్యా, వైద్య రంగాల సత్వర అభివృద్ధి కి దోహద పడుతుంది అని హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.


 అంతర్జాతీయ కృష్ణపట్నం పోర్టు గూడూరుకు అనుసంధానం

 కృష్ణపట్నం పోర్టు ఎంట్రీ గూడూరు నియోజకవర్గం ద్వారా ఉండటం వలన పోర్టు కనెక్టివిటీ కూడా బాలాజీ జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కి దోహదపడుతుంది అని ఆయన వెల్లడించారు.

 గూడూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులు:హరిశ్చంద్ర రెడ్డి

 కృష్ణపట్నం పోర్టు నుండి దుగ్గరజపట్నం మీదుగా నాయుడుపేట వరకు 6 లైన్లు రహదారి

 నాయుడు పేట- తిరుపతి కి 6 లైన్లు రహదారి నిర్మాణ దిశలో 

 కృష్ణపట్నం నుండి కార్పోరేట్ షోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వార పోర్టు నుండి వరగలి,గూడూరు,వెంకటగిరి, ఏర్పేడు వరకు 4 లైన్లు రోడ్లు నిర్మాణం

 దుగ్గరజపట్నం ను ఫిషింగ్ హార్బర్ గా కేంద్రం నిధులతో ఏర్పాటు చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందుతారు

 40 కోట్లతో పులికాట్ సరస్సు నుండి బే ఆఫ్ బెంగాల్ కి ప్రవేశ ద్వారం పూడిక తీస్తే 20 కుప్పా లలో 20 వేల మంది మత్స్యకారులకు,ప్లామింగోల అవా సానానికి ప్రయోజనం

 కేంద్ర జల శక్తి మిషన్ ద్వారా కండలేరు నుండి గూడూరు గ్రేడ్ 1 ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారం

 కేంద్రటూరిజం,మంత్రిత్వశాఖ ద్వారా గుమ్మళ్ల దిబ్బ,తూపిలి పాళెం బీచ్ లు పర్యాటకం గా అభివృద్ధి

  టిటిడి నిధులు ద్వారా మల్లామ్ సుబ్రహ్మణేశ్వర స్వామి,గూడలి సంగమేశ్వర స్వామి ఆలయాలు మరియు గూడూరులో చోళ రాజులు నిర్మించిన పురాతన ఆలయాలు,సత్రాలు అభివృద్ధి

 గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచన చేయండి,రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్  మోహన్ రెడ్డి తీసుకున్న జిల్లాల పునర్విభజన ప్రజలు నిర్ణయానికి  మద్దతు ఇవ్వాలి గూడూరు లో పుట్టి పెరిగిన బిడ్డగా కొరుతున్నాను, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి, గూడూరు నెల్లూరు కి దగ్గర అనే కారణం చేత ఎంతో భవిష్యత్ ఉన్న బాలాజీ జిల్లా ను కాదు అనుకుంటే..మన భవిష్యత్ తో పాటు భావితరాల భవిష్యత్ నాశనం అవుతుంది, ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు ఏమి అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యా, వైద్య,పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చెందిన శ్రీ బాలాజీ జిల్లాలో గూడూరు నియోజకవర్గం కలపడం మన అదృష్టం అని కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.


 ప్రజలకు అవగాహన కోసం భారీ బైక్ ర్యాలీ

 బాలాజీ జిల్లా లో గూడూరు నియోజకవర్గం కలవడం ద్వారాజరిగేఉపయోగాలు,నెల్లూరు జిల్లాలో ఉంటే ప్రయోజనాలు పై ప్రజలకు అవగాహన కల్పించే దిశలో రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఉత్తేజ పరిచారు. సుమారు 200 బైక్ లతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గున్నారు.