లోపాలను సరిదిద్దికుందాం...


పార్టీని మరింత బలోపేతం చేద్దాం...


కార్పొరేషన్ ఎన్నికల్లో గుణపాఠాలు నేర్చుకున్నాం...









జీవితంలో ఎన్నో మోసాలు ఎదుర్కొన్నాం...కొంతమంది పార్టీని నమ్మించి ద్రోహం చేశారు...

- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నెల్లూరు రూరల్ లోని 28, 36 వ డివిజన్ నాయకులతో, కార్యకర్తలతో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జరిగిన లోపాలను సరిదిద్దుకొనీ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తులా కృషి చేయాలని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు తమకు గుణపాఠాలను నేర్పించాయన్నారు...కొంతమంది పార్టీ ని నమ్మించి నమ్మకద్రోహం చేశారన్నారు. జీవితంలో ఇలాంటి మోసాలను ఎన్నో ఎదుర్కొన్నామని, వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చేయి చేయి కలిపి సమిష్టిగా కృషి చేయాలి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా జిల్లా నాయకులు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు పోరాటం చేయాలని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ద్యేయంగా పని చేయాలని, నారా చంద్ర బాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.