ఓటర్ల వెరిఫికేషన్ దేశం నేతలు
ఓటర్ల వెరిఫికేషన్ దేశం నేతలు
కావలి రవికిరణాలు : పట్టణ పరిధిలోని 26 వార్డ్ లోని ఓటర్ల వెరిఫికేషన్ ను అధికారులతో కలిసి తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. స్థానిక 92వ బూత్ బి ఎల్ ఓ అధికారితో కలిసి వీధి వీధి తిరిగి ఓటర్ల జాబితాను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కేశవులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా తప్పులుగా నమోదు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం నివాసం ఉంటున్న కుటుంబాల ఓటర్లను జాబితాలో చేర్చాలని అధికారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.