పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం  చేసిన వాళ్లంటీర్స్  రవి కిరణాలు ప్రతినిధి కోట:

సమాజం, సేవలు పట్ల అవగాహన లేని నాయకుడు పవన్

పవన్  రాజకీయాలకు  అనర్హుడు-వాళంటీర్స్ 

వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థ పై  జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కోట మండలం వాలంటీర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా మంగళవారం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను ఊరేగించి అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద  దగ్ధం చేశారు.  ఈ సందర్భంగా కోట మండలం వాలంటీర్స్ మాట్లాడుతూ  గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ  సచివాలయ వ్యవస్థను దీనికి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థను వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించారన్నారు.వాలంటీర్లు విధులు చేపట్టినప్పటి నుంచి సేవా  భావం తో ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నారు  అన్నారు.  కరోనా సమయంలో  ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయని విధంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి సేవచేసి ఎంతోమంది కరోనా బాధితులను ప్రాణాలను కాపాడేమన్నారు. నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వాలంటీర్లపై కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్  వాలంటీర్ వ్యవస్థ విమర్శించడం  అవగాహన రాహిత్యమన్నారు.  రాష్ట్రంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు సైతం ప్రశంసించారన్నారు.  కులం,మతం,వర్గం,పార్టీ భేదం లేకుండా  ప్రతి ఒక్కరికి సమాన దృష్టితో  పథకాలు సేవలు చేరవేస్తుంటే   అర్థం చేసుకోలేని పవన్   రాజకీయాలకు అనర్హులు అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు వైయస్సార్సీపి మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, చేవూరు. నాగయ్య నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి,  జెడ్పిటిసి దాసరి కోటయ్య,  చిల్లకూరు. సాయిప్రసాద్ రెడ్డి,కనుపూరు.జగదీష్, మద్దతు తెలిపారు