గ్రామ పంచాయితీ ల తనిఖీలలో భాగంగా 28-04-2022 బోగోలు మండలం విశ్వనాథరావుపేట సందర్శించి గ్రామ పంచాయతి రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించి జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించడం జరిగినది. గ్రామ సచివాలయం రికార్డులను పరిశీలించి ప్రజలకు సకాలంలో పారదర్శకతతో సేవలు అందించాలని సూచించడం జరిగింది.

బోగోలు మండలంలోని  SGV కండ్రిగ పంచాయితీ లోని  చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్నితనిఖీ చేయడం జరిగింది. కేంద్రం నందు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించి, పంచాయితీ కార్యదర్శి కి తగు సూచనలు జారీ చేయడం జరిగింది.
ప్రతి ఇంటి నుంచి చెత్తను నేరుగా సేకరించి తప్పనిసరిగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నకు తరలించి , వర్మీ కంపోస్టు తయారు చేయాలని, తద్వారా గ్రామ పంచాయతీ లకు ఆదాయం తీసుకురావాలని ఆదేశించడం జరిగింది.