జెఈఈ మెయిన్2025 ఏప్రిల్ ఫలితాలలో విశ్వసాయి విజయాలు




నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 19 : 

క్రమశిక్షణ సీనియర్ అధ్యాపకులచే విద్యాబోధన పరిరక్షణ వల్లే తాము జెఈఈ మెయిన్ ఫలితాలలో విశ్వ సాయి జూనియర్ కళాశాలకి చెందిన 57 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు జాతీయస్థాయిలో ఎన్నికయ్యారని, మరియు జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు అర్హత సాధించాలని ఆ కళాశాల చైర్మన్ డా''ఎన్. సత్యనారాయణ మాగుంట లేఔట్ లోని విశ్వసాయి కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి. రామ్ రిత్విక్ జాతీయస్థాయిలో208వ,యం. శ్రావణ్ కుమార్ రెడ్డి 365వ జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మరో తొమ్మిది మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ సాధించారని, వీరందరూ మే 18న జరగబోవు జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా చక్కని ప్రతిభను కనుపరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పుష్పగుచ్చాలతో అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. కళాశాల వైస్ చైర్మన్ శ్రీ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థుల కృషి, అధ్యాపకుల పర్యవేక్షణ ఈ విజయాలకు కారణమని, ఈ విజయానికి కారణమైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ సాయి కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.