ప్రతి ఒక్కరూ అరకు లోయ అందాలను ఆస్వాదించటానికి వీలుగా, విశాఖపట్టణం - అరకు మధ్య పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా మరిన్ని విస్టాడోమ్(అద్దాల) కోచ్ లను రైల్వే మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయబోతోంది. అరకుకు విచ్చేసే పర్యాటకులకు మరింత సంతోషాన్ని అందించబోతోంది.